- విమానాల్లో ఇరుముడికి కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి
- వరుసగా మూడో ఏడాది భక్తులకు వెసులుబాటు కల్పించిన కేంద్రం
- క్యాబిన్ బ్యాగేజీగా ఇరుముడి తీసుకెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్
- విమానాశ్రయాలు, సీఐఎస్ఎఫ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు
- భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి రామ్మోహన్ నాయుడు
శబరిమల యాత్ర చేపట్టే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. విమానాల్లో ప్రయాణించే సమయంలో పవిత్రమైన ‘ఇరుముడి’ని క్యాబిన్ బ్యాగేజీగా తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. భక్తుల మనోభావాలు, సాంప్రదాయాలను గౌరవిస్తూ వరుసగా మూడో ఏడాది కూడా ఈ సడలింపును కొనసాగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా వెల్లడించారు.
శతాబ్దాలుగా అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇరుముడిని వెంట తీసుకెళ్లడం ఆచారంగా వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అయ్యప్ప స్వాములు తమ పవిత్ర యాత్రను ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సాఫీగా కొనసాగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)తో పాటు విమానాశ్రయాల నిర్వాహకులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. పవిత్ర దీక్ష చేపట్టి యాత్రకు బయలుదేరే భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ నిర్ణయానికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. విమానాల్లో భద్రతా కారణాల దృష్ట్యా సాధారణంగా నిషేధించే వస్తువుల జాబితా నుంచి ఇరుముడికి మినహాయింపునిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు ఈ సీజన్లోనూ అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని విమానాశ్రయాల రీజినల్ కార్యాలయాలు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది.
సాధారణంగా ఇరుముడిలో నెయ్యి నింపిన కొబ్బరికాయ, కర్పూరం వంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి. విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ద్రవ పదార్థాలు, మండే స్వభావం గల వస్తువులను క్యాబిన్లోకి అనుమతించరు. అయితే శబరిమల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, భక్తుల భక్తి భావాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. విమానాల్లో ప్రయాణించే వేలాది మంది భక్తులకు ఈ నిర్ణయం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.