- ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి కదలికలపై నిరంతర నిఘా
- థర్మల్ డ్రోన్లు, ఏఐ కెమెరా ట్రాప్‌ల వినియోగానికి పవన్ ఆదేశం
- హనుమాన్ బృందాలతో విస్తృత గస్తీ
- అవసరమైతే ఇతర రాష్ట్రాల రెస్క్యూ టీమ్‌ల సహకారం
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు పరిసర అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచుతూనే, పరిసర గ్రామాల ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఉన్నతాధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పులి జాడను గుర్తించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. థర్మల్ డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కెమెరా ట్రాప్లను విస్తృతంగా ఏర్పాటు చేసి, పులి సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తించాలని నిర్దేశించారు. స్థానిక అటవీ బృందాలతో సమన్వయం చేసుకుంటూ, ప్రత్యేక ‘హనుమాన్’ (H.A.N.U.M.A.N) బృందాలతో అటవీ ప్రాంతంలో విస్తృత గస్తీ చేపట్టాలని ఆదేశించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ (సీడబ్ల్యూఎల్) స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులైన ప్రత్యేక పులి ట్రాకింగ్, రెస్క్యూ నిపుణులను రప్పించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాలు, నిర్దేశిత ప్రోటోకాల్స్‌ను పక్కాగా పాటిస్తూ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. ఈ క్రమంలో అటు ప్రజలకు గానీ, ఇటు పులికి గానీ ఎలాంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూనే, వన్యప్రాణికి ఎటువంటి గాయం కాకుండా సురక్షితంగా పట్టుకోవాలని తేల్చిచెప్పారు.
పులి సంచరిస్తున్న పరిసర గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి, పులిని సురక్షితంగా బంధించే వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.