- కిచెన్లలో బొద్దింకలు, ఎలుకల విసర్జితాలు
- హైదరాబాద్‌లో నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు రెస్టారెంట్లపై కఠిన చర్యలు
- మాదాపూర్ బావర్చి, స్పైస్ కిచెన్లతో పాటు మరో రెండు హోటళ్లపై వేటు
- అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్టల్, బేకరీ తక్షణ మూసివేత
- సుమారు 135 కిలోల నాసిరకం ఆహార పదార్థాల సీజ్
- ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి ఆ హోటళ్లను తొలగించాలని ఆదేశం
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు (TG SAFE) కఠిన చర్యలు తీసుకున్నారు. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా తీవ్ర లోపాలకు పాల్పడిన నాలుగు హోటళ్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు. వీటితో పాటు అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక హాస్టల్, బేకరీలను మూసివేయించారు.
లైసెన్సులు రద్దయిన వాటిలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ‘మాదాపూర్ బావర్చి’, కూకట్‌పల్లిలోని ‘ది స్పైస్ కిచెన్’, టోలిచౌకిలోని ‘మతామ్ అల్ యమాని అరేబియన్ రెస్టారెంట్’, చందానగర్‌లోని ‘అన్నపూర్ణ క్యాటరర్స్’ ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో తీవ్రమైన అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల విసర్జితాలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లలో శాకాహారం, మాంసాహారాన్ని నిబంధనలకు విరుద్ధంగా కలిపి నిల్వ ఉంచడం, నాసిరకం సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగించడం, కిచెన్ నేలలు దెబ్బతినడం, గోడలు పొగతో నిండి ఉండటం వంటి సమస్యలు కనిపించాయి. అంతేకాకుండా, ఆహారాన్ని తయారుచేసే సిబ్బందికి ఎలాంటి వైద్య పరీక్షల ధ్రువపత్రాలు లేవని తనిఖీల్లో తేలింది.
మరోవైపు, కనీస ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్లు లేకుండా నిర్వహిస్తున్న టోలిచౌకిలోని ‘అల్ కరీమ్ బేకర్స్’, గౌళిదొడ్డిలోని ‘శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్’లను కూడా అధికారులు మూసివేయించారు.
ఈ సోదాల సందర్భంగా కల్తీ జరిగినట్లు అనుమానం ఉన్న 8 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. దాదాపు 135 కిలోల నాణ్యతలేని ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. రాజు గారి బిర్యానీ, స్వాద్ స్పైసీ రెస్టారెంట్లకు త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. మెహఫిల్ రెస్టారెంట్‌కు లోపాలను సరిదిద్దుకోవాలని ‘ఇంప్రూవ్‌మెంట్ నోటీసు’ ఇచ్చి, త్వరలోనే రీ-ఇన్‌స్పెక్షన్ చేయనున్నట్లు వెల్లడించారు.
లైసెన్సులు పునరుద్ధరించే వరకు సస్పెన్షన్‌కు గురైన నాలుగు రెస్టారెంట్లను తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు అధికారులు స్పష్టం చేశారు. నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని, ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై నిరంతరం కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.