- తన పిల్లల అనారోగ్యమే కెంట్ ఆర్వో స్థాపనకు బీజం
- ఇండియన్ ఆయిల్ ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి అడుగుపెట్టిన మహేశ్ గుప్తా
- బంధువుల డిమాండ్‌తో విస్తరించిన హోమ్మేడ్ ప్యూరిఫైయర్
- కేవలం వాల్యుయేషన్ కాకుండా వాస్తవ సమస్యల పరిష్కారమే ప్రధానం
- ప్రస్తుత పరిస్థితుల్లో క్లీన్ ఎనర్జీ, నీటి పొదుపుపై దృష్టి పెట్టాలని పిలుపు
ప్రముఖ నీటి శుద్ధి పరికరాల తయారీ సంస్థ ‘కెంట్ ఆర్వో సిస్టమ్స్’ ప్రస్థానం ఒక తండ్రి పడిన తపన నుంచి మొదలైంది. ఒక కుటుంబ సమస్యకు ఇంట్లో రూపొందించిన పరిష్కారమే నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, కెంట్ ఆర్వో దిగ్గజ బ్రాండ్‌గా ఎలా రూపాంతరం చెందిందో సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ గుప్తా వివరించారు. ఇండియా టుడే మాస్టర్‌క్లాస్ వేదికగా ఆయన తన వ్యాపార ప్రయాణాన్ని, ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.
1998లో మహేశ్ గుప్తా ఇద్దరు పిల్లలు కామెర్ల (జాండీస్) బారిన పడ్డారు. ఆ సమయంలో తాగునీటిని శుభ్రం చేయడానికి వాటర్ ప్యూరిఫైయర్ వాడాలని వైద్యులు సూచించారు. అయితే, అప్పట్లో మార్కెట్లో అందుబాటులో ఉన్న మెషీన్లు కేవలం బ్యాక్టీరియాను మాత్రమే తొలగించగలిగేవి, నీటిలోని ఇతర కాలుష్య కారకాలను నివారించలేకపోయేవి. మెకానికల్ ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న మహేశ్ గుప్తా.. తన పిల్లల ఆరోగ్యం కోసం రివర్స్ ఆస్మాసిస్ (RO) సాంకేతికతతో ఇంట్లోనే స్వయంగా ఒక సరికొత్త వాటర్ ప్యూరిఫైయర్‌ను తయారు చేశారు. అది అద్భుతంగా పనిచేయడంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది.
ఈ విషయం తెలుసుకున్న బంధువులు, సన్నిహితులు కూడా తమ కోసం అలాంటి ప్యూరిఫైయర్ తయారు చేసి ఇవ్వాలని ఆయన్ను కోరారు. దాంతో భారత్‌లో స్వచ్ఛమైన తాగునీటి శుద్ధి పరికరాలకు భారీ డిమాండ్ ఉందని ఆయన గుర్తించారు. అదే ఆలోచన కెంట్ ఆర్వో సిస్టమ్స్ ఏర్పాటుకు బలమైన పునాది వేసింది. అక్కడ్నించి ఆ కంపెనీ అద్భుతమైన విజయాలతో దేశీయ కంపెనీల్లో ఉన్నతస్థాయికి ఎదిగింది.
1975లో ఐఐటీ కాన్పూర్ నుంచి పట్టభద్రుడైన గుప్తా, 1998 వరకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి అడుగుపెడతానన్నప్పుడు ఆయన తండ్రి తీవ్ర ఆందోళన చెందారు. అయితే, వ్యాపారంలో విఫలమైతే మళ్లీ ఉద్యోగం చేసుకుంటానని తండ్రికి నచ్చజెప్పి ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
కెంట్ ఆర్వో మార్కెట్లోకి వచ్చిన తర్వాత వినియోగదారులకు సాంకేతికతను ప్రత్యక్షంగా చూపించడం (డెమోలు), సమర్థవంతమైన సర్వీస్ సపోర్ట్ అందించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా రివర్స్ ఆస్మాసిస్ ప్రక్రియలో సహజ ఖనిజాలు కోల్పోకుండా ఉండేందుకు పేటెంట్ పొందిన ప్రత్యేక సాంకేతికతను సంస్థ తీసుకొచ్చింది.
నేటి తరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మహేశ్ గుప్తా కీలక సూచన చేశారు. కేవలం డబ్బు సంపాదించడం లేదా భారీ వాల్యుయేషన్ సాధించి సంస్థ నుంచి త్వరగా నిష్క్రమించడం (ఎగ్జిట్) కోసమే వ్యాపారాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యను గుర్తించి, దానికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించినప్పుడే ఏ వ్యాపారమైనా నిలబడుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను కొత్తగా ఏదైనా రంగంలోకి అడుగుపెట్టాల్సి వస్తే.. క్లీన్ ఎనర్జీ, నీటి ఎద్దడి సమస్యల పరిష్కారంపైనే పనిచేస్తానని ఆయన చెప్పారు. ఒకవైపు ఒక మనిషి స్నానానికి ఐదు బకెట్ల నీటిని వాడుతుంటే, మరోవైపు ఒక్క బకెట్ నీటి కోసం కూడా ఎంతోమంది అల్లాడుతున్నారని, ఇలాంటి తీవ్రమైన సంక్షోభాల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.