- అమరావతిలో రూ.174 కోట్ల పెట్టుబడితో ఒబెరాయ్ హోటల్
- 150 ప్రత్యక్ష, 250 పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
- త్వరలో వెల్లడికానున్న హోటల్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలు
ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆతిథ్య రంగాన్ని విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రముఖ హోటల్ రంగ సంస్థ ఒబెరాయ్ గ్రూప్ అమరావతిలో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) అధికారికంగా కుదిరింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్‌డీఏ అధికారులు, ఒబెరాయ్ గ్రూప్ ప్రతినిధులు ఈ ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ద్వారా రాజధాని నగరానికి దాదాపు రూ.174 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి.
ఈ లగ్జరీ హోటల్ ప్రాజెక్టు రాకతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. దాదాపు 150 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా.. మొత్తంగా 400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డిలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో ప్రముఖ బ్రాండ్లు రాజధానికి రావడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. హోటల్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.