- ఉత్తరాంధ్ర సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
- శత్రుచర్ల మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
- నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న సీఎం
- శత్రుచర్ల డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ అన్న మంత్రి లోకేశ్
- శత్రుచర్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ శత్రుచర్ల విజయరామరాజు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శత్రుచర్ల విజయరామరాజు మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. "నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ప్రజాజీవితంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా సేవలందించిన సీనియర్ నేత శత్రుచర్ల విజయరామరాజు గారి మరణం విచారకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఆయన పాత్ర చిరస్మరణీయం. విజయరామరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ కూడా శత్రుచర్ల మృతికి నివాళులర్పించారు. "తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు గారి మృతి బాధాకరం. వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ..సంతాపం తెలియజేస్తున్నాను. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా రాజుగారు చేపట్టిన ప్రజాసేవా కార్యక్రమాలు చిరస్మరణీయం. డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్‌గా ముద్రపడిన శత్రుచర్ల ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని లోకేశ్ వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శత్రుచర్ల విజయరామరాజు తనదైన ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఆయన ఉత్తరాంధ్ర సమస్యలపై నిరంతరం గళమెత్తారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు శత్రుచర్ల మృతికి సంతాపం తెలుపుతున్నారు.