- ఏపీలో రూ.800 కోట్ల పెట్టుబడికి ఆస్ట్రోబేస్ స్పేస్ ఒప్పందం
- విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీఈడీబీతో ఎంవోయూ
- శ్రీ సత్యసాయి జిల్లా తిమ్మసముద్రంలో 360 ఎకరాలకు కేంద్రం విస్తరణ
- రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, హాట్ ఫైర్ పరీక్షల నిర్వహణకు అవకాశం
- ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ అంతరిక్ష రంగ పెట్టుబడి లభించింది. ప్రముఖ ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీ సంస్థ ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్, రాష్ట్రంలో రాకెట్ టెస్టింగ్, లాంచ్ వెహికల్ అభివృద్ధి మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు రూ.800 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (APEDB)తో సంస్థ గురువారం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా తిమ్మసముద్రంలో ప్రస్తుతం ఉన్న రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ కేంద్రాన్ని సంస్థ మరింత పెద్ద ఎత్తున విస్తరించనుంది. ప్రస్తుతం దాదాపు 22 ఎకరాల్లో ఉన్న ఈ సదుపాయానికి అదనంగా మరో 339 ఎకరాలను చేర్చనున్నారు. దీంతో ఈ టెస్టింగ్ కేంద్రం మొత్తం విస్తీర్ణం సుమారు 360 ఎకరాలకు చేరుకుంటుంది. భారత ప్రైవేట్ అంతరిక్ష రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.
ఈ పరిణామంపై ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ సీఈఓ, కో-ఫౌండర్ నీరజ్ ఖండేల్వాల్ స్పందిస్తూ.. భారతదేశం నుంచే అత్యాధునిక అంతరిక్ష రవాణా వ్యవస్థలను నిర్మించే తమ ప్రయత్నాలలో ఈ విస్తరణ ఒక కీలక మైలురాయి అని తెలిపారు. విస్తరించిన ఈ మౌలిక వసతుల ద్వారా స్టాటిక్ హాట్-ఫైర్ టెస్టులు, స్టేజ్-లెవల్ హాప్ టెస్టులు వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రయోగాలను నిర్వహించవచ్చని ఆయన వివరించారు. అంతేకాకుండా పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీ (రీయూజబుల్ లాంచ్ వెహికల్స్) అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికతలో భారత్ ఇప్పటికే తన సత్తాను నిరూపించుకుందని, భవిష్యత్తులో ఉపగ్రహాలు, పేలోడ్లను మరింత తరచుగా, విశ్వసనీయంగా నింగిలోకి చేరవేయడమే తదుపరి లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా దాదాపు 500 మందికి ప్రత్యక్షంగా, మరో 1,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కాగా, బెంగళూరులో ఎవరెస్ట్ ఇంజిన్, AB220 మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ అభివృద్ధికి అవసరమైన అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కర్ణాటకలో రూ.500 కోట్ల పెట్టుబడి ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆస్ట్రోబేస్ ఈ తాజా ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సంయుక్తంగా ఏపీ ప్రభుత్వ ఆతిథ్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.