- 2036 నాటికి మరో 100 విమానాశ్రయాలు 200 ఆధునిక హెలిపోర్టులు నిర్మిస్తామన్న రామ్మోహన్ నాయుడు
- ఉడాన్ రెండో దశ మౌలిక వసతుల కోసం రూ. 30 వేల కోట్ల కేటాయింపు
- ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక విషయాలను వెల్లడించారు. ‘భారత విమాన రంగం- అనుసంధానం’ అంశంపై ఆయన ప్రసంగిస్తూ... ఆత్మనిర్భర్ భారత్ కింద రాబోయే రెండేళ్లలో భారతదేశం సొంతంగా పౌర విమానాన్ని తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం విమానాల తయారీకే పరిమితం కాకుండా, డిజైనింగ్ నైపుణ్యాలను కూడా దేశీయంగానే అభివృద్ధి చేసుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఉడాన్ పథకం రెండో దశ విస్తరణ కోసం రూ. 30,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా 2036 నాటికి దేశవ్యాప్తంగా మరో 100 విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలిపోర్టులను నిర్మిస్తామన్నారు. 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కి చేరిందని, ఏటా ప్రయాణికుల సంఖ్య 25 కోట్లను దాటిందని వివరించారు. ‘డిజి యాత్ర’ విధానం వల్ల ప్రయాణికుల బోర్డింగ్ సమయం 90 సెకన్ల నుంచి 20 సెకన్లకు తగ్గిందని పేర్కొన్నారు.
ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు ఇది సరైన సమయమని మంత్రి పిలుపునిచ్చారు. విమాన విడిభాగాల తయారీ, మెయింటెనెన్స్, డ్రోన్లు, ఎయిర్ టాక్సీల విభాగాల్లో విస్తారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయం పనులు గడువు కంటే ఆరు నెలల ముందే పూర్తయ్యాయని ప్రశంసించారు. అనంతపురం జిల్లా లేపాక్షి సమీపంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, హైదరాబాద్ హుస్సేన్సాగర్లను అనుసంధానిస్తూ సీప్లేన్ సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వివరించారు.