- 2028 నాటికి రాష్ట్రంలో రెట్టింపు కానున్న విద్యుత్ అవసరాలు
- గ్రీన్ ఎనర్జీ ఆధారంగానే నడిచేలా ఎయిర్ కూల్డ్ డేటా సెంటర్లు
- రాష్ట్రంలో ఇప్పటివరకు 5 లక్షల ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వం
- రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి విధానపరమైన స్థిరత్వం ఎంతో ముఖ్యమన్న లోకేశ్
క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను సౌదీ అరేబియాలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ‘భారతదేశ ఇంధన భవిష్యత్తుకు ఊతమివ్వడం: పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్’ అంశంపై నిర్వహించిన ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.
సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో భారీగా స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, దానిని గ్రీన్ మాలిక్యూల్స్‌గా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే సత్తా ఏపీకి ఉందని లోకేశ్ వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇంధన స్వయం సమృద్ధిపై స్పష్టమైన విధానంతో ఉన్నారని గుర్తుచేశారు. రాయలసీమలో పుష్కలమైన సూర్యరశ్మి, ఇతర ప్రాంతాల్లో పవన విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు.
గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం దాదాపు 30 శాతం పెరిగిందని, కొత్తగా వస్తున్న పరిశ్రమలు, డేటా సెంటర్ల కారణంగా 2028 నాటికి విద్యుత్ డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశముందని మంత్రి విశ్లేషించారు. ఈ పెరిగే డిమాండ్‌ను తట్టుకోవడానికి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. సంప్రదాయ జలవిద్యుత్ ప్రాజెక్టుల మాదిరిగా ఏళ్ల తరబడి సమయం తీసుకోకుండా, ఆధునిక సాంకేతికతతో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరగకముందే వాటిని పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో కూడా పోటీ ధరలకే నిరంతరాయంగా గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు.
పరిశ్రమల అభివృద్ధికి విధానపరమైన స్థిరత్వం ఎంతో అవసరమని లోకేశ్ నొక్కిచెప్పారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సరైన పాలసీలు లేకపోవడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గుర్తుచేశారు. ఆ ఐదేళ్ల కాలంలో కేవలం 6 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మాత్రమే అదనంగా చేరగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే ఏకంగా 4.8 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై వస్తున్న అపోహలను మంత్రి నారా లోకేశ్ తోసిపుచ్చారు. గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు సాంప్రదాయ నీటి ఆధారిత కూలింగ్ కాకుండా, అత్యాధునిక ‘ఎయిర్ కూల్డ్’ పద్ధతిలో పనిచేస్తాయని తెలిపారు. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో పోలిస్తే డేటా సెంటర్లు దాదాపు పది రెట్లు తక్కువ నీటిని వినియోగిస్తాయని గణాంకాలతో వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల్లో కనీసం 80 శాతాన్ని గ్రీన్ ఎనర్జీ ద్వారానే సమకూర్చాలనే స్పష్టమైన నిబంధన విధించినట్లు వెల్లడించారు. భారత పౌరుల డేటా దేశ సరిహద్దుల్లోనే భద్రంగా ఉండటం జాతీయ భద్రత దృష్ట్యా అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఇప్పటికే వివిధ రంగాల్లో దాదాపు 5 లక్షల ఉద్యోగాలను కల్పించగలిగామని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో గుర్తించిన 25 పారిశ్రామిక క్లస్టర్లను పూర్తి సామర్థ్యంతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ ధరలను మరింత తగ్గించి పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
లోకేశ్ వరుస సమావేశాలు
ఈ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ వేదికగా మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పారిశ్రామిక పెట్టుబడులను, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను తీసుకురావడమే ధ్యేయంగా ఆయన జరిపిన చర్చలు మంచి ఫలితాలను ఇచ్చాయి.
ఈ భేటీల అనంతరం, రాష్ట్రంలో ఏకంగా రూ.36,000 కోట్ల భారీ పెట్టుబడితో సమగ్ర పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్, డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్లీన్మాక్స్ సంస్థ ముందుకు వచ్చింది. అలాగే రూ.3,000 కోట్ల వ్యయంతో అధునాతన జింక్-బ్రోమైడ్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఆర్చియన్ కెమికల్స్ సంస్థ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా సుమారు 1,000 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
మరోవైపు, తిరుపతిలో 200 ఎకరాల విస్తీర్ణంలో సెమీకండక్టర్ పార్క్ అభివృద్ధి చేసేందుకు సైయంట్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. అలాగే అరకు కాఫీని అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు ఎస్ఎల్ఎన్ కాఫీ సంస్థతో లోకేష్ చర్చించారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు తయారుచేసే స్వయం ఏపీ, లేపాక్షి ఉత్పత్తులతో పాటు సముద్ర ఉత్పత్తులను అంతర్జాతీయ కొనుగోలుదారులకు అనుసంధానించాలని వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలను మంత్రి కోరారు. దీనిపై వాల్‌మార్ట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.