- రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన పొన్నం ప్రభాకర్
- పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శ
- కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడమే కాకుండా అమలు చేసే సత్తా ఉందని స్పష్టీకరణ
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించిన ఆయన, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదంటూ ఘాటుగా బదులిచ్చారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘన చరిత్ర గాంధీ కుటుంబానిదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. "పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?" అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా, పకడ్బందీగా పరీక్షలు కూడా నిర్వహించిందని వివరించారు. కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని అమలు చేసే సత్తా కూడా ఉందని స్పష్టం చేశారు.
అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, అసైన్డ్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నేరెళ్లలో దళితులపై దాడులు, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడం, మల్లన్నసాగర్ నిర్వాసితులపై లాఠీఛార్జ్ వంటి ఘటనలు బీఆర్‌ఎస్ పాలన వైఫల్యాలకు నిదర్శనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.