- నేటి నుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
- రూ.12 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు
- 2.46 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
- అమిత్ షా, పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు
- కియా మోటార్స్‌తో ప్రత్యేకంగా కీలక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్న 31వ భాగస్వామ్య సదస్సు నేడు విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సదస్సు వేదికగా రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు తరలిరానున్నాయి. సుమారు రూ.12,13,853 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోగా, వీటి ద్వారా రాష్ట్రంలో 2,46,373 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రెండు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సులో మొత్తం 141 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు, 30 ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయనున్నారు. వీటిలో కియా మోటార్స్‌తో కుదుర్చుకోనున్న ఒక ప్రత్యేక ఒప్పందంతో పాటు, పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో మరో రెండు కీలక ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతితో పాటు యూఏఈ, సింగపూర్, కెనడా వంటి వివిధ దేశాల మంత్రులు కూడా పాల్గొననున్నారు.
‘నవ ప్రపంచ క్రమంలో వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, నాయకత్వం’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి సుమారు రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, వాటిలో రూ.7.1 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కే దశలో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా పోర్టులు, ఇంధనం, ఏవియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించనున్నారు.