- విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 78 ఏళ్ల వయసులో తుదిశ్వాస
- ఐదు సార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు ఎంపీగా గెలిచిన శత్రుచర్ల
- ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ‘మన్యం పులి’గా గుర్తింపు పొందిన సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి సంస్థానాధీశుడైన శత్రుచర్ల విజయరామరాజు 1948 ఆగస్టు 4న జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ఆయన, ఉత్తరాంధ్ర ప్రజలకు సుపరిచితులు. నియోజకవర్గ సమస్యలపై గళమెత్తి ఆయన ప్రజల మన్ననలు పొందడంతో పాటు, రాజకీయ వర్గాల్లో ‘ఉత్తరాంధ్ర టైగర్’, ‘మన్యం పులి’గా గుర్తింపు పొందారు.
శత్రుచర్ల విజయరామ రాజు తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్వతీపురం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1978లో జనతా పార్టీ తరపున నాగూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, అనంతరం కాంగ్రెస్, టీడీపీల్లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా, కొణిజేటి రోశయ్య కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2017లో టీడీపీ తరఫున శ్రీకాకుళం స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 2023 వరకు కొనసాగారు.
శత్రుచర్ల విజయరామరాజు భార్య రాణి శశికళాదేవి. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారు.