- విశాఖలో ఘనంగా ప్రారంభమైన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్
- ఏపీ, ఎంఎస్ఎంఈ పెవిలియన్‌లను ప్రారంభించిన పీయూష్ గోయల్, చంద్రబాబు, పవన్
- తిరుపతి, విశాఖ, అమరావతి ఎకనమిక్ రీజియన్ల ప్రగతిపై అధికారుల ప్రజెంటేషన్
విశాఖపట్నం వేదికగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్, ఎంఎస్ఎంఈ పెవిలియన్‌లను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను నేతలు ఆసక్తిగా పరిశీలించారు.
సదస్సు వేదిక వద్ద ప్రముఖులకు ధింసా, తప్పెటగుళ్లు వంటి రాష్ట్ర సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా చంద్రబాబు, పీయూష్ గోయల్, పవన్ కళ్యాణ్ స్వయంగా డోలు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం పెవిలియన్‌లో తిరుపతి, విశాఖపట్నం, అమరావతి ఎకనమిక్ రీజియన్లతో పాటు సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు ఇచ్చిన డిజిటల్ ప్రజెంటేషన్‌ను కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమరావతి టవర్ మోడల్ అందరినీ ఆకట్టుకుంది.
రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే తోలుబొమ్మలాట, పెన్ కలంకారీ, గిరిజన కళాకృతుల స్టాళ్లను నేతలు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారుల ప్రతిభను కేంద్రమంత్రికి సీఎం వివరించారు. అనంతరం అరకు కాఫీ స్టాల్ వద్ద నేతలు కాఫీని రుచి చూశారు. సదస్సు ప్రాంగణంలో నేతలు కాసేపు బ్యాటరీ కారులో ప్రయాణించి పరిశ్రమల పురోగతిని సమీక్షించారు. నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.