- విశాఖలో రెండో రోజు కొనసాగుతున్న పెట్టుబడుల సదస్సు
- వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యమంత్రి సమక్షంలో 12 కీలక ఒప్పందాలు
- పెట్టుబడులు లేకపోతే సంపద సృష్టి జరగదన్న చంద్రబాబు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు 12 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఏపీ సీఆర్డీఏ, ఏపీ మారిటైమ్ బోర్డు, ఐటీ ఎలక్ట్రానిక్స్‌తో పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పీ4 నమూనాకు సంబంధించి ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను సీఎం స్వయంగా సంస్థల ప్రతినిధులకు అందజేశారు.
ఈ సదస్సులో పేదల సంక్షేమం, సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో కలిసి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా హీరో మోటోకార్ప్ సంస్థ 28 జిల్లాల్లోని 1,120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రూ.32.48 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అలాగే, 100 గ్రామాల్లోని 25 వేల ‘బంగారు కుటుంబాల’ జీవనోపాధి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఐటీసీ లిమిటెడ్ ఆ కుటుంబాలను దత్తత తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పీ4 కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 11.37 లక్షల కుటుంబాలను వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకోగా, లక్ష మందికి పైగా మార్గదర్శకులుగా నమోదయ్యారు.
సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... “పెట్టుబడులు లేకపోతే సంపద సృష్టి జరగదని.. అందుకే తాను పీపీపీ(PPP), P4 మోడల్‌ను నమ్ముతున్నట్లు” స్పష్టం చేశారు. ఐటీ శకం ముగుస్తోందని, ఏఐ, క్వాంటం శకం మొదలైందని ఆయన వివరించారు. సమర్థవంతమైన నాయకత్వంతోనే సంస్కరణలు వేగవంతమవుతాయని, తలసరి ఆదాయంలో ఏపీ ప్రస్తుతం 13వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. “నా పాలసీల వల్లే స్థానిక ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగింది. ప్రజలకు మంచి చేస్తే.. వాళ్లే ఆశీర్వదిస్తారు” అని వ్యాఖ్యానించారు.