ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ నిరాకరణ
- విచారణ చివరి దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచన
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరైన పద్ధతి కాదని, ముందుగా హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
కేసు విచారణ అత్యంత వేగంగా సాగుతోందని, మొత్తం 87 మంది సాక్షుల్లో అత్యధికుల విచారణ ఇప్పటికే పూర్తయిందని ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం సముచితం కాదని ఆయన తన వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. విచారణ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని అనంతబాబు భార్య చేసిన అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
ఈ సందర్భంగా పిటిషన్‌ను వెనక్కి తీసుకుని హైకోర్టును ఆశ్రయించాలని అనంతబాబు తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. విచారణను రోజువారీ పద్ధతిలో కొనసాగించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో, వీడియో ఫైల్స్, డిజిటల్ ఆధారాలకు సంబంధించిన మరో అనుబంధ పిటిషన్‌ను కూడా పిటిషనర్ తరఫు వారు ఉపసంహరించుకున్నారు.
గతంలో బెయిల్‌పై విడుదలైన అనంతబాబుకు... సాక్షులను బెదిరించారన్న ఆరోపణలతో బెయిల్ రద్దు కావడంతో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.