విశాఖపట్నం నగర మేయర్ ముక్కా శ్రావణిని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం పరామర్శించారు. శ్రావణి తండ్రి, టీడీపీ సీనియర్ నేత ముక్కా ముత్యాలనాయుడు శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విశాఖలోని ఆమె నివాసానికి వెళ్లిన లోకేశ్.. మేయర్ శ్రావణిని, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా ముత్యాలనాయుడు చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్పొరేటర్‌గా, విశాఖ జిల్లా పార్టీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా ముత్యాలనాయుడు పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మంత్రి లోకేశ్‌ వెంట ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడె పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పెందుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ గండి బాబ్జి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

20261123fr6b040ca03c83d.jpg20261123fr6b040cb87bcdf.jpg20261123fr6b040cc9e5c79.jpg20261123fr6b040cdf15f8f.jpg20261123fr6b040d03419fa.jpg20261123fr6b040d19471ec.jpg