- తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించనున్న అజ్ఞాత భక్తుడు
- ఆలయ చరిత్రలోనే అత్యంత భారీ వ్యక్తిగత విరాళంగా నిలవనున్న కానుక
- నవంబర్ 26న సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి ఆభరణాల అందజేత
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల స్వర్ణాభరణాలను విరాళంగా సమర్పించనున్నారు. తిరుమల ఆలయ చరిత్రలోనే ఇది అత్యంత భారీ వ్యక్తిగత కానుకగా రికార్డు సృష్టించనుంది. ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఈ ఆభరణాలను దాత అధికారికంగా అందజేయనున్నారు.
ఈ స్వర్ణాభరణాల విలువ మార్కెట్లో సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ.160 కోట్ల వరకు ఉంటుందని అంచనా. స్వామివారి నిత్య కైంకర్యాలు, ప్రత్యేక అలంకరణలకు అనుగుణంగా 45 నుంచి 46 రకాల ఆభరణాలతో తొమ్మిది సెట్లను ప్రత్యేకంగా చేయించారు. ఇందుకోసం టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి, ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం దాదాపు 15 నెలల పాటు శ్రమించి వీటిని సిద్ధం చేయించారు.
ఓ ఎన్నారై పారిశ్రామికవేత్త తాను స్థాపించిన కంపెనీ లాభాల్లో భాగంగా బంగారాన్ని వేంకటేశ్వరస్వామికి ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీవారి అనుగ్రహం వల్లే వ్యాపారంలో ఈ స్థాయికి చేరుకున్నానని నమ్మిన ఆయన, తన మొక్కు ప్రకారం లాభాల్లో వాటాను స్వామివారికి బంగారు రూపంలో చెల్లించాలని నిర్ణయించుకున్నారు. అయితే, తన పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెల్లడించవద్దని ఆయన ముఖ్యమంత్రికి విన్నవించి అజ్ఞాతంగా ఉండిపోయారు.
ఈ అపూర్వ కానుక సమర్పణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నవంబర్ 26న తిరుమలకు రానున్నారు. స్వామివారి దర్శనం అనంతరం, రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.