రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఈ వేడుకకు విచ్చేసిన మంత్రి నారా లోకేశ్.. నూతన వధూవరులైన అనీష్ వెంకటాద్రి, డాక్టర్ సుమాంజలిలను కలిసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నవదంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ మంత్రి నారా లోకేశ్ కు సాదర స్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ వధూవరుల కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు.
20261123frd52af5154a27.jpg20261123fr22b9386e0d25.jpg20261123frfdee8ee6eaa0.jpg20261123fr2c53002b1653.jpg20261123fr70fd44e6042f.jpg