- బీహెచ్ఈఎల్లో 415 ట్రైనీ ఉద్యోగాల భర్తీ
- ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ అర్హులకు మంచి అవకాశం
- దరఖాస్తులకు డిసెంబర్ 28 ఆఖరు తేదీ
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక
- 2027 జనవరి 27న రాత పరీక్ష నిర్వహణ
కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 415 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రక్రియ మొదలైంది.
ఈ నోటిఫికేషన్లో ఇంజినీర్/ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగంలో 200 ఖాళీలు ఉన్నాయి. వీటిలో మెకానికల్ 80, ఎలక్ట్రికల్ 30, ఎలక్ట్రానిక్స్ 25, సివిల్ 15, హెచ్ఆర్ 20, ఫైనాన్స్ 20, ఐటీ/కంప్యూటర్ సైన్స్ 10 పోస్టులు కేటాయించారు. అలాగే సూపర్వైజర్ ట్రైనీ విభాగంలో మెకానికల్ 103, ఎలక్ట్రికల్ 30, ఎలక్ట్రానిక్స్ 11, సివిల్ 26, హెచ్ఆర్ 20, ఫైనాన్స్ 25 ఖాళీలు ఉన్నాయి.
ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కోసం 60 శాతం మార్కులతో డిగ్రీ, 55 శాతంతో హెచ్ఆర్ విభాగంలో ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా తప్పనిసరి. ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. సూపర్వైజర్ పోస్టులకు 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా, హెచ్ఆర్ కోసం బీబీఏ/బీఎంఎస్/బీఎస్‌డబ్ల్యూ, ఫైనాన్స్ కోసం కామర్స్ డిగ్రీ ఉండాలి.
2026 నవంబర్ 1 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 27 ఏళ్లు మించకూడదు. హెచ్ఆర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలకు 28 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. రిజర్వ్డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (సీబీటీ), ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా తుది ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.1,072 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.472 నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు careers.bhel.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.