ట్యాబ్లెట్లను మెరిసే అల్యూమినియం ఫాయిల్‌తోనే ఎందుకు ప్యాక్ చేస్తారు?
- మందుల స్ట్రిప్‌లో ఫాయిల్ కీలక రక్షణ పొర
- తేమ, గాలి, వెలుతురు నుంచి మందును కాపాడే ఫాయిల్
- అల్యూమినియం చాలా పలుచగా ఉన్నా బలమైన రక్షణ
- ఫాయిల్ వల్ల మందు ఎక్స్‌పైరీ తేదీ పెరగదన్న నిపుణులు
- అందుబాటులో ఉండడం, సులభమైన తయారీ కోసం ఓ కారణం
మందుల స్ట్రిప్ చేతిలోకి తీసుకున్నప్పుడు వెనుక కనిపించే మెరిసే వెండి రంగు పొరను మనం తరచూ చూస్తుంటాం. కానీ అది ఎందుకు ఉంటుందో చాలామందికి తెలియదు. అది కేవలం మందుల ప్యాకింగ్ కోసం పెట్టే సాధారణ ఫాయిల్ కాదు. మందు నాణ్యత దెబ్బతినకుండా కాపాడటంలో దీనికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది.
తేమ, గాలి, వెలుతురు నుంచి రక్షణ
కొన్ని మందులు తేమ, గాలి, వెలుతురుకు చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి మందులోని పదార్థాలపై ప్రభావం చూపి దాని నాణ్యతను తగ్గించవచ్చు. అందుకే అల్యూమినియం ఫాయిల్‌ను రక్షణ కవచంలా ఉపయోగిస్తారు. ఇది బయటి వాతావరణం మందులోకి చేరకుండా అడ్డుకుంటుంది.
పలుచగా ఉన్నా.. రక్షణ ఎక్కువ
అల్యూమినియంను చాలా పలుచని పొరగా తయారు చేయొచ్చు. అయినా ఇది తేమ, గాలి, వెలుతురును అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేస్తుంది. అందుకే మందుల స్ట్రిప్‌ల తయారీలో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. అందుబాటులో ఉండటం, తయారు చేయడం సులభం కావడం కూడా మరో కారణం.
అన్ని మందులకూ ఒకే ప్యాకింగ్ కాదు
ప్రతి మందును అల్యూమినియం ఫాయిల్‌లోనే ప్యాక్ చేయరు. మందు స్వభావం, దానికి అవసరమైన నిల్వ పరిస్థితులను బట్టి ప్యాకింగ్‌ను ఎంచుకుంటారు. కొన్ని మందులను బాటిళ్లలో పెడతారు. మరికొన్నింటిని సాధారణ బ్లిస్టర్ ప్యాక్‌లలో విక్రయిస్తారు.
రెండు వైపులా ఫాయిల్ ఎందుకు?
కొన్ని మందులకు మరింత ఎక్కువ రక్షణ అవసరం ఉంటుంది. అలాంటి మందులకు రెండు వైపులా అల్యూమినియం ఫాయిల్ ఉండే ప్యాక్‌ను వాడతారు. ఇది తేమ, గాలి, వెలుతురు నుంచి మరింత బలమైన రక్షణ ఇస్తుంది.
ఎక్స్‌పైరీ తేదీ పెరుగుతుందా?
అల్యూమినియం ఫాయిల్ వాడటం వల్ల మందు ఎక్స్‌పైరీ తేదీ పెరగదు. మందు ఎంతకాలం నాణ్యత, భద్రత, ప్రభావాన్ని నిలబెట్టుకుంటుందో కంపెనీలు ముందుగానే పరీక్షిస్తాయి. ఆ కాలం వరకు మందు సురక్షితంగా ఉండేందుకు ప్యాకింగ్ రక్షణ కల్పిస్తుంది.