- వారణాసి 2027 ఏప్రిల్ 7 విడుదల అవుతుందని గతంలో ప్రకటన
- భారీగా పెండింగ్లో ఉన్న వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్
- ఔట్పుట్ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్న రాజమౌళి
- మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్న వైనం
- ఇప్పటికే పూర్తియిన షూటింగ్.. సీజీ.. జోరుగా రీ-రికార్డింగ్ పనులు
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి' విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ముందుగా ప్రకటించిన 2027 ఏప్రిల్ 7వ తేదీ నాటికి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమేనని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారీ వీఎఫ్ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్), గ్రాఫిక్స్ పనుల కోసం దర్శకుడు రాజమౌళికి మరింత సమయం అవసరమని తెలుస్తోంది. కేవలం విడుదల తేదీని అందుకోవడం కోసం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటానికి జక్కన్న సిద్ధంగా లేరని సమాచారం. వీఎఫ్ఎక్స్ ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాతే రిలీజ్ తేదీపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్. అయితే ఈ వాయిదా వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అధికారికంగా 2027 ఏప్రిల్ 7వ తేదీనే రిలీజ్ డేట్ గా కొనసాగుతోంది.
ఇటీవల నవంబర్ 15న ఎక్స్ వేదికగా చిత్ర యూనిట్ స్పందిస్తూ.. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం సీజీ వర్క్స్, రీ-రికార్డింగ్ నడుస్తున్నాయని, త్వరలోనే డబ్బింగ్ పనులు మొదలవుతాయని వెల్లడించింది. మైథాలజీ, టైమ్ ట్రావెల్, యాక్షన్ అంశాలతో ముడిపడిన అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ 'కుంభ'గా కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో చిత్రీకరించిన తొలి నాన్-ఇంగ్లీష్ చిత్రంగా నిలుస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ విడుదల తేదీపై అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.