- తుంగభద్ర నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలన్న శ్రీనివాస్ గౌడ్
- ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరివ్వకుంటే 20 వేల ఎకరాల్లో పంట నష్టమని వ్యాఖ్య
- తుమ్మిళ్ల, ఆర్డీఎస్ చివరి తడులకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్
తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆయకట్టుకు తక్షణమే చివరి తడుల కోసం 1 టీఎంసీ నీటిని విడుదల చేయించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తుంగభద్ర నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని శ్రీనివాస్ గౌడ్ వివరించారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీటి విడుదల ఆగడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఆర్డీఎస్ పరిధిలోని 12 నుంచి 22వ డిస్ట్రిబ్యూటరీ గ్రావిటీ కెనాల్స్ కింద సాగవుతున్న సుమారు 10 వేల ఎకరాలకు చివరి తడులు అందడం లేదన్నారు. అలాగే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని మరో 10 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందక మొత్తం 20 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చేతికొచ్చిన పంటలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వంతో తక్షణమే సంప్రదింపులు జరిపి, తుంగభద్ర నుంచి రావాల్సిన నీటిని విడుదల చేయించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.