- రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావొచ్చన్న జార్కిహోళి
- ఉత్తర కర్ణాటక అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమే మార్గమన్న బీజేపీ ఎమ్మెల్యే
- బెళగావి వేదికగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై మాట్లాడిన జార్కిహోళి
కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదు నుంచి పదేళ్లలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసమే ప్రత్యేక రాష్ట్రం దిశగా పరిస్థితులు మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
బెళగావిలోని సువర్ణ విధాన సౌధలో డిసెంబర్ 2 నుంచి కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అరభావి నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ జార్కిహోళి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చేందుకే సువర్ణ విధాన సౌధను నిర్మించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో దివంగత మాజీ మంత్రి ఉమేష్ కత్తి ప్రత్యేక ఉత్తర కర్ణాటక రాష్ట్రాన్ని కోరుతూ, బెళగావి రాజధానిగా ఉంటేనే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలను బీజేపీ ప్రస్తావిస్తుందని తెలిపారు.
మరోవైపు, ఈ వ్యాఖ్యలపై కర్ణాటక రాష్ట్ర మంత్రి హెచ్.సి. బాలకృష్ణ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. గతంలో కర్ణాటకతో పాటు కేంద్రంలో బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తర కర్ణాటకను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. అప్పుడే అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రస్తావన వచ్చేది కాదని వ్యాఖ్యానించారు.