- నవంబరు 11న గ్రీస్ లో పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్
- నవంబరు 21న చెన్నైలో గ్రాండ్ గా రిసెప్షన్
- తాజాగా సన్ గ్రూప్ ఉద్యోగులకు కోసం భారీ విందు ఏర్పాటు
- ఉద్యోగులను ఆప్యాయంగా పలకరించిన అనిరుధ్-కావ్య దంపతులు
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ దంపతులు తమ వివాహ వేడుకలను ఘనంగా కొనసాగిస్తున్నారు. పెళ్లి సంబరాల్లో భాగంగా సన్ గ్రూప్ ఉద్యోగుల కోసం వారు ప్రత్యేకంగా ఒక భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
సన్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన వధూవరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో అనిరుధ్ లేత నీలం రంగు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, కావ్య మారన్ కూడా ఆకట్టుకున్నారు. వేదిక ప్రాంగణమంతా కలియదిరుగుతూ వారు ఉద్యోగులను చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. వారితో మాట కలుపుతూ సరదాగా సమయం గడిపారు.
సంస్థ ఉద్యోగుల కోసం చికెన్ తందూరీ, మటన్ బిర్యానీ, పాయా వంటి ఘుమఘుమలాడే రుచికరమైన వంటకాలతోపాటు రకరకాల స్వీట్లు, ఐస్ క్రీమ్ లతో ఈ విందును సిద్ధం చేశారు. కొత్త దంపతులు స్వయంగా తమ వద్దకు వచ్చి మాట్లాడటంతో ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ జంట వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా జరిగింది. ఆ తర్వాత చెన్నైలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో నవంబరు 21న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.