- 53 బంతుల్లో 204 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ
- వైభవ్ ప్రతిభను కొనియాడిన మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్
- వైట్ బాల్ క్రికెట్ హాస్యాస్పద స్థితికి చేరిందంటూ కామెంట్స్
- ఆట పూర్తిగా బ్యాటర్ల వైపే మొగ్గుచూపుతోందని ఆందోళన
- కేవలం బ్యాటింగ్ మాత్రమే క్రికెట్ కాదంటూ ఎక్స్‌లో పోస్ట్
యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ యూఏఈపై 53 బంతుల్లోనే 204 పరుగులు బాది సృష్టించిన విధ్వంసంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ అసాధారణ ప్రతిభను ప్రశంసిస్తూనే, ప్రస్తుత పరిమిత ఓవర్ల క్రికెట్ (వైట్ బాల్ క్రికెట్) ఎంత హాస్యాస్పదమైన స్థితికి చేరుకుందో చెప్పడానికి ఈ ఇన్నింగ్సే నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. ఆట పూర్తిగా బ్యాటర్ల వైపే మొగ్గుచూపుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
దోహా వేదికగా జరిగిన ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భాగంగా భారత్-ఎ తరఫున ఆడిన వైభవ్, 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 384.90 స్ట్రైక్ రేట్‌తో ఈ ఘనత సాధించాడు. 28 బంతుల్లోనే సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి లిస్ట్-ఎ చరిత్రలోనే సరికొత్త రికార్డులను నెలకొల్సిన విషయం తెలిసిందే
ఈ ఇన్నింగ్స్‌పై సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించిన మంజ్రేకర్, "వైభవ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడు ఆడిన ఈ ఇన్నింగ్స్ వైట్ బాల్ క్రికెట్ ఎంతటి హాస్యాస్పద దశకు చేరిందో మరోసారి గుర్తుచేసింది. అభిమానులు కోరుకునేది ఇదే అనుకోవడం పెద్ద భ్రమ. క్రికెట్ అనేది బ్యాట్, బంతి రెండింటికీ సమానమైన ఆట.. కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే కాదు" అని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలర్లకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందన్న చర్చకు మంజ్రేకర్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.