- పోలీసింగ్‌లో సరికొత్త విప్లవం.. అందుబాటులోకి ఏఐ ఆధారిత ఫిర్యాదుల వ్యవస్థ
- పంజాగుట్ట పీఎస్‌ను సందర్శించిన డీజీపీ సీవీ ఆనంద్, సీపీ మహేశ్ భగవత్
- టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతమవుతాయన్న సీవీ ఆనంద్
టెక్నాలజీ సాయంతో పోలీస్ సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేసే దిశగా తెలంగాణ పోలీస్ శాఖ కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ‘మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్’గా ఎంపిక చేసింది. ఈ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థల పనితీరును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన వెంట అడిషనల్ డీజీపీ అకున్ సబర్వాల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఉన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ సేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలిసారిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఐ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇకపై బాధితులు పోలీస్ అధికారుల కోసం గంటల తరబడి స్టేషన్‌లో ఎదురుచూడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫిర్యాదుదారులు ఏఐ యంత్రం ముందు నిలబడి తమ సమస్యను నోటితో వివరిస్తే చాలని, ఆ యంత్రమే బాధితులు చెప్పిన వివరాలతో ఫిర్యాదు కాపీని స్వయంగా రూపొందిస్తుందని వివరించారు.
ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదు చేరుతుందని డీజీపీ తెలిపారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు పోలీస్ సేవలను సత్వరమే చేరవేయవచ్చని, బాధితుల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ సరికొత్త విధానం ఎంతగానో దోహదపడుతుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.