- 27 జిల్లాల్లో 3,880 పంచాయతీలకు పోలింగ్ ప్రారంభం
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 83 లక్షల మంది
- మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్.. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో 3,880 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఉదయమే బారులు తీరారు.
ఈ దశలో మొత్తం 3,803 సర్పంచ్ స్థానాలకు, 29,603 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 83,52,338 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 42,46,608 మంది మహిళలు, 41,05,292 మంది పురుషులు ఉన్నారు. ఇప్పటికే 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం గంట విరామం తర్వాత, మధ్యాహ్నం 2 గంటల నుంచి అదే పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటిలో సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.