- ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన నిధులను డిసెంబర్లో జమ చేసే అవకాశం
- రెండో విడతలో 3.29 లక్షల మంది విద్యార్థులకు అందనున్న లబ్ధి
- ఒక్కొక్కరి ఖాతాలో రూ.13 వేల చొప్పున జమ చేయనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ఈ నిధులను డిసెంబర్ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడతలో సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందని వారు, అలాగే ఆగస్టు 25వ తేదీ లోపు ఒకటో తరగతి లేదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ రెండో విడతలో ఆర్థిక సాయం అందనుంది. మొత్తం 3,29,201 మంది విద్యార్థులకు సంబంధించి అర్హులైన తల్లుల ఖాతాల్లో నేరుగా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఈ మొత్తం జమ కానుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 10న జీవో నెంబర్ 26 ద్వారా ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి వార్షికంగా రూ.15,000 ఆర్థిక సాయం అందించాల్సి ఉండగా.. పాఠశాలలు, జూనియర్ కళాశాలల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం రూ.2,000 మినహాయించి, మిగిలిన రూ.13,000 మొత్తాన్ని తల్లుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
మొదటి విడతలో నిధులు రాని అర్హులైన తల్లులు కొద్ది రోజులుగా ఈ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత డిసెంబర్ నెలలోనే ఈ నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. నిధుల జమకు సంబంధించిన ఖచ్చితమైన తేదీపై ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.