తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ నేత కుమారుడు అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన టీడీపీ నేత కంటిపూడి శ్రీనివాస్ కుమారుడు కేశవ్ చౌదరి (27) శనివారం ఓ జలపాతంలో పడి మృతి చెందారు.

ఉన్నత చదువుల కోసం కేశవ్ అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి, ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఈ క్రమంలో వారాంతం కావడంతో స్నేహితులతో కలిసి ఓ జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ అదుపుతప్పి ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించినట్లు సమాచారం.

ఈ దుర్ఘటన గురించి తెలియగానే కేశవ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారాడన్న వార్త విని వారు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి ఇంకా తెలియాల్సి ఉంది.