- ఐపీఎల్ 2027 నుంచి తప్పుకున్న ట్రావిస్ హెడ్
- హెడ్ నిష్క్రమణపై ఎస్ఆర్‌హెచ్ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న ఆకాశ్ చోప్రా
- ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా సులభమని వ్యాఖ్య
- హెడ్ స్థానంలో షాయ్ హోప్‌ను తీసుకోవాలని సూచన
- అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌ను కోల్పోతేనే అసలు నష్టమని విశ్లేషణ
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరమైనంత మాత్రాన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపీఎల్‌లో ఒక ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా సులభమైన పనుల్లో ఒకటని ఆయన అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో బిజీ షెడ్యూల్, కుటుంబంతో సమయం గడిపేందుకు గాను వచ్చే సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు హెడ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సన్‌రైజర్స్ యాజమాన్యం రిటెన్షన్ గడువుకు ముందు అతడిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడాడు.
"ఒక ఓపెనర్ స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకుంటే కేవలం 5 నుంచి 10 పరుగుల తేడా మాత్రమే రావచ్చు. కానీ, జోష్ హేజిల్‌వుడ్, జోఫ్రా ఆర్చర్, మిచెల్ స్టార్క్ లేదా పాట్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌ను కోల్పోతేనే అసలైన నష్టం ఉంటుంది" అని చోప్రా వివరించాడు. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ వద్ద సుమారు రూ. 40 కోట్ల పర్సు ఉందని, కమిన్స్ వంటి కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.
డిసెంబర్‌లో జరిగే వేలంలో హెడ్ స్థానంలో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌ను తీసుకోవడం మంచి ఎంపిక అని చోప్రా సలహా ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి హోప్ లెఫ్ట్-రైట్ కాంబినేషన్‌ను అందిస్తాడని, అవసరమైతే వికెట్ కీపింగ్, నాయకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తించగలడని పేర్కొన్నాడు. కాగా, హెడ్ మూడు సీజన్లలో ఎస్ఆర్‌హెచ్ తరఫున 43 మ్యాచ్‌లు ఆడి 176.14 స్ట్రైక్ రేట్‌తో 1,351 పరుగులు చేశాడు.