- ధోనీ ప్లాన్ పాటించనందుకు తనపై కోప్పడ్డాడని చెప్పిన కుల్దీప్
- 300కు పైగా వన్డేలు ఊరికే ఆడలేదని ధోనీ హెచ్చరించినట్లు వెల్లడి
- 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోని ఘటనను గుర్తు చేసుకున్న స్పిన్నర్
- ధోనీ చెప్పినట్టు చేయడంతో వికెట్ లభించిందని వివరణ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో వ్యూహాలు రచించడంలో దిట్ట. ఫీల్డింగ్ సెట్ చేయడం, బౌలర్లకు సూచనలు ఇవ్వడం, పక్కా ప్లాన్‌తో బ్యాటర్‌ను ఔట్ చేయడం ధోనీకి వెన్నతో పెట్టిన విద్య. అయితే, ధోనీ చెప్పిన మాట వినకపోతే మాత్రం ఆయన చాలా భయంకరంగా ఉంటాడని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ పాత సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
2017లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా బ్యాటింగ్ చేస్తున్నాడు. "అప్పుడు నా దగ్గరకు వచ్చిన ధోనీ భాయ్, ‘కె.డి, పాయింట్‌లో ఉన్న ఫీల్డర్‌ను ముందుకు రమ్మని చెప్పు. ఆఫ్‌స్టంప్‌కు అవతల బంతిని వెయ్యి, టాప్ ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంది’ అని సూచించాడు" అని కుల్దీప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అయితే, తాను ధోనీ చెప్పినట్లు చేయలేదని కుల్దీప్ అన్నాడు. "అది గమనించిన ధోనీ వెంటనే నా వద్దకు వచ్చి, ‘నేను వెర్రివాడిలా కనిపిస్తున్నానా? 300కి పైగా వన్డేలు ఊరికే ఆడలేదు’ అని గట్టిగా అన్నాడు. ఆ మాటలకు నేను నిజంగా భయపడ్డాను" అని కుల్దీప్ గుర్తుచేసుకున్నాడు.
ఆ తర్వాత ధోనీ చెప్పినట్లే ఫీల్డింగ్ మార్చి బౌలింగ్ చేయగా, పెరీరా టాప్ ఎడ్జ్‌తో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడని కుల్దీప్ పేర్కొన్నాడు. ధోనీ వ్యూహం నూటికి నూరు శాతం ఫలించిందని కుల్దీప్ వివరించాడు. అప్పటికి ధోనీ కెప్టెన్ కాకపోయినా, ఆటపై అతడికున్న పట్టు, స్పిన్నర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే సామర్థ్యానికి ఈ ఘటనే నిదర్శనం. కాగా, ఆ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టగా, 43 బంతుల్లో 118 పరుగులు చేసిన రోహిత్ శర్మకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.