- హైదరాబాద్ అండాల కేసులో సద్గురు హెల్త్‌కేర్ సూత్రధారి అని వెల్లడి
- ఏప్రిల్ నుంచి రూ.487 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు
- మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 14కు చేరిన నిందితుల సంఖ్య
- దేశవ్యాప్తంగా 43 ఫర్టిలిటీ సెంటర్లతో భారీ నెట్వర్క్ నిర్వహణ
- ప్రధాన నిందితులు ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
నగరంలో సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భారీ దందా వెనుక సద్గురు హెల్త్‌కేర్ సర్వీస్ సెంటర్ సూత్రధారి అని పోలీసులు తేల్చారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే ఈ ముఠా రూ.487 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో మొత్తం నిందితుల సంఖ్య 14కు చేరింది.
ఈ కేసు వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం మీడియాకు వెల్లడించారు. సద్గురు హెల్త్‌కేర్‌కు చెందిన హైదరాబాద్ సీవోవో ప్రతీక్ అనిల్ గంగ్లానీ, ఒయాసిస్ ఫర్టిలిటీ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజశ్రీ దేవ్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డాక్టర్ దుర్గారావు పేద మహిళలను తీసుకువస్తే, వారి నుంచి సేకరించిన అండాలను గంగ్లానీ, రాజశ్రీ దేవ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఫర్టిలిటీ సెంటర్లకు సరఫరా చేసేవారని దర్యాప్తులో తేలింది. అరెస్టయిన ఎగ్జిక్యూటివ్‌లు నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు జీతాలు పొందుతున్నట్లు తెలిసింది.
ఈ ముఠా దేశవ్యాప్తంగా 43 ఫర్టిలిటీ సెంటర్లతో కూడిన భారీ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సెంటర్ల ద్వారా ప్రతి నెలా సుమారు 100 మంది మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నిందితులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాల ద్వారా ఏప్రిల్ నుంచి నవంబరు 26 వరకు మొత్తం రూ.487.82 కోట్ల లావాదేవీలు జరిపినట్లు సీపీ తెలిపారు.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురిని పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా దీనిని సీసీఎస్‌కు బదిలీ చేయాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. అక్టోబరు 30న బేగంపేటలోని ఓ మహిళా వసతి గృహంలో జరిపిన తనిఖీలతో ఈ అండాల అక్రమ దందా వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే.