- వాషింగ్టన్ పోస్ట్ కథనంతో వెలుగులోకి నిజాలు
- కమాండ్ అండ్ కంట్రోల్, డ్రోన్ ఆపరేషన్ల కోసం వినియోగం
- అనధికారిక వినియోగంపై ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం
- ఇరాన్‌లో స్టార్‌లింక్‌కు అధికారిక లైసెన్స్ లేదు
అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇరాన్ సైన్యం... ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వాడుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ‘వాషింగ్టన్ పోస్ట్’ శనివారం ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మొదలైన ఘర్షణల ప్రారంభంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొన్న వివరాల ప్రకారం, ఇరాన్ బలగాలు తమ కమాండ్ అండ్ కంట్రోల్ కార్యకలాపాల కోసం, డ్రోన్ దాడులను పర్యవేక్షించడానికి స్టార్‌లింక్‌ను ఉపయోగించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్‌కు ఇచ్చిన క్లాసిఫైడ్ అప్‌డేట్‌లో ఇరాన్ సైన్యం ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు క్లుప్తంగా వివరించారని కథనం పేర్కొంది.
ఈ అనధికారిక వినియోగం గురించి తెలుసుకున్న స్పేస్‌ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కంపెనీ అంతర్గత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, అమెరికా సైన్యం కూడా స్టార్‌లింక్ మిలిటరీ వెర్షన్ అయిన 'స్టార్‌షీల్డ్' వాడుతూ, తక్కువ ధర ప్లాన్‌తో డ్రోన్లను నడిపినట్లు మస్క్‌కు సమాచారం అందిందని కూడా ఆ వర్గాలు చెప్పాయి.
వాస్తవానికి ఇరాన్‌లో పనిచేయడానికి స్టార్‌లింక్‌కు అధికారికంగా లైసెన్స్ లేదు. అయితే, అక్కడ తమ సేవలు యాక్టివ్‌గా ఉన్నాయని మస్క్ గతంలోనే ప్రకటించారు. వాషింగ్టన్ ‘పోస్ట్ కథనం’పై స్పందించడానికి స్పేస్‌ఎక్స్, ఇరాన్ విదేశాంగ శాఖ అందుబాటులోకి రాలేదు. ఈ కథనం గురించి తమకు తెలియదని యూఎస్ రక్షణ శాఖ రాయిటర్స్‌కు తెలిపింది.