- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 ఫైనల్లో భారత్ విజయం
- ఫైనల్లో 3-1 తేడాతో చైనాపై గెలుపొందిన భారత్
- రెండు గోల్స్‌తో మెరిసిన దీపిక, ఒక గోల్ చేసిన ఇషిక
- భారత క్రీడాకారులకు హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటన
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటికే పలు చారిత్రక విజయాలు అందుకున్న జట్టు, తాజాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 ఫైనల్లో చైనాను 3-1 తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. భోపాల్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెనుకబడినప్పటికీ, అద్భుతంగా పుంజుకుని ఘన విజయం నమోదు చేసింది.
మ్యాచ్ ఆరంభంలో చైనా ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ సంపాదించినా, భారత రక్షణశ్రేణి దానిని సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే, 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను యుజున్ చెన్ గోల్‌గా మలచడంతో చైనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి చైనా ఇదే ఆధిక్యంతో నిలిచింది.
రెండో అర్ధభాగంలో భారత జట్టు పట్టుదలతో బరిలోకి దిగింది. ఫలితంగా 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను స్టార్ ప్లేయర్ దీపిక గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేసింది. ఆ తర్వాత భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. 42వ నిమిషంలో నేహా అందించిన బంతిని ఇషిక ఫీల్డ్ గోల్‌గా మలచడంతో భారత్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాతి నిమిషంలోనే (43వ నిమిషం) దీపిక మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కి పెంచింది. చివరి వరకు ఇదే స్కోరును నిలబెట్టుకున్న భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది.
ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టుకు 2026 సంవత్సరాన్ని అద్భుతంగా ముగిసింది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్, ప్రపంచకప్‌లో ఐదో స్థానం (52 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శన), ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌కు అర్హత వంటి ఎన్నో మైలురాళ్లను భారత జట్టు అందుకుంది. ఈ చారిత్రక విజయం నేపథ్యంలో హాకీ ఇండియా ప్రతి క్రీడాకారిణికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.5 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించింది.
ఈ టోర్నమెంట్లో దీపిక "టాప్ స్కోరర్", "ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్" అవార్డులను గెలుచుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో మలేషియాను 5-2 తేడాతో ఓడించి జపాన్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.