- ఏపీలో 1,534 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- 378 ఎస్సై, 1,156 కానిస్టేబుల్ ఖాళీల భర్తీ
- ఈ నెల 27 సాయంత్రం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు
- డిసెంబర్ 16 సాయంత్రం 5 వరకు దరఖాస్తు గడువు
- కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2027 జనవరి 31న నిర్వహణ
- ఎస్సై రాత పరీక్ష 2027 ఫిబ్రవరి 28న
ఆంధ్రప్రదేశ్‌లో యూనిఫాం ఉద్యోగాల కలలు కంటున్న అభ్యర్థులకు తీపి కబురు అందింది. పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. పలు విభాగాల్లో మొత్తం 1,534 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా ఈ వివరాలను వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్‌లో 378 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై), 1,156 కానిస్టేబుల్ తదితర పోస్టులు ఉన్నాయి. ఎస్సై విభాగంలో సివిల్ (పురుషులు, మహిళలు) 253, ఏఆర్ రిజర్వ్ ఎస్సై 116, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో 9 పోస్టులు కేటాయించారు. కానిస్టేబుల్ కేటగిరీలో సివిల్ కానిస్టేబుల్ 542, ఏఆర్ కానిస్టేబుల్ 285, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ 158, జైళ్ల శాఖలో పురుష వార్డర్లు 150, మహిళా వార్డర్లు 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది.
పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ఖరారు చేసింది. కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష 2027 జనవరి 31న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఎస్సై పోస్టుల రాతపరీక్షను ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. ఎస్సై అభ్యర్థులకు పేపర్–1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. కమ్యూనికేషన్ ఎస్సై, పీటీవో, సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రైవర్ లాంటి ఇతర పోస్టుల దరఖాస్తు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది.