- తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం
- చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ భారీ కానుక
- విరాళం విలువ సుమారు రూ. 206 కోట్లుగా అంచనా
- ఆభరణాల అప్పగింత కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, సుమారు రూ. 206 కోట్ల విలువైన 121 కిలోల స్వర్ణాభరణాలను శ్రీవారికి కానుకగా అందించారు. నేడు తిరుమలలో జరిగిన ఈ చారిత్రాత్మక అప్పగింత కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
ఈ విరాళం వివరాలను పరిశీలిస్తే, 106 కిలోల బంగారంతో స్వామివారి అలంకరణ కోసం వజ్రాలు, రత్నాలు పొదిగిన పాదకవచాలు, కౌస్తుభం, నాగాభరణాలు వంటివి ఉన్నాయి. మిగిలిన 15 కిలోల బంగారంతో పద్మావతి అమ్మవారికి బంగారు వస్త్రాన్ని రూపొందించారు. సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ అధికారులకు వర్ధమాన్ జైన్ ఈ ఆభరణాలను అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భక్తుడి విరాళం ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. తరతరాలుగా భక్తులు స్వామివారిపై చూపిస్తున్న అచంచల భక్తికి, విశ్వాసానికి ఈ కానుక నిదర్శనమని అన్నారు. తిరుమలలో లభించే దివ్యానుభూతి ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు తన అర్ధాంగి భూవనేశ్వరితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.