- నంద్యాల జిల్లాలో పంచాయతీ పోలింగ్ వేళ తీవ్ర ఉద్రిక్తత
- అహోబిలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
- అఖిలప్రియ కారు అద్దాలు ధ్వంసం.. ఇరువర్గాల మధ్య రాళ్లదాడి
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలం, జమ్మదిన్నె గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అహోబిలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.
అహోబిలంలో పోలింగ్ సరళిని పరిశీలించే క్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనంపై వైకాపా మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన టీడీపీ, వైసీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లదాడికి దిగారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
మరోవైపు ఆళ్లగడ్డ మండలం జమ్మదిన్నె పోలింగ్ కేంద్రం వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ మద్దతుదారులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు పోలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.