- తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ
- సీఎం చంద్రబాబు సమక్షంలో వెంకన్నకు స్వర్ణాభరణాల సమర్పణ
- చెన్నై వ్యాపారవేత్త వర్థమాన్ జైన్ దంపతుల భారీ విరాళం
కలియుగ వైకుంఠనాథుడు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత వర్థమాన్ జైన్, ఆయన సతీమణి రాధికా జైన్ సమర్పించిన 121 కిలోల స్వర్ణాభరణాల సమర్పణ తిరుమల చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందిన ఈ కానుకల్లో స్వామివారికి కిరీటం మొదలుకొని పాదపద్మాల వరకు అలంకరించే 46 రకాల విశిష్ట ఆభరణాలు (106 కేజీలు), అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సమర్పించిన బంగారు చీర (15 కేజీలు) ఉన్నాయి.
ఆ 46 రకాల దివ్యాభరణాలు ఇవే:
ఆ 46 రకాల దివ్యాభరణాలు ఇవే:
- బంగారు పాద కవచములు -3
- బంగారు అందెలు -3
- బంగారు పాకడాలు
- బంగారు తులసిపాత్ర హారం
- బంగారు సాదా వడ్డాణము
- బంగారు గంటల మొలతాడు
- బంగారు సూర్యకటారి
- బంగారు అష్టోత్తర కాసుల మాల
- బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
- బంగారు పులిగోరు
- బంగారు అశ్వథ పాత్ర హారము
- బంగారు ఐదు పేటల కంఠీలు 5
- బంగారు చంద్రవంకీ కంఠీ
- బంగారు వైకుంఠ హస్తం
- బంగారు నాగాభరణ కడియాలు 4
- బంగారు కౌస్తుభం
- బంగారు శ్రీవత్సం
- బంగారు మోచేయి
- బంగారు కటి హస్తం
- బంగారు నాగాభరణ వడ్డాణము
- బంగారు గోపు
- బంగారు మోపుగల యజ్ఞోపవీతం
- బంగారు శంఖ కవచము
- బంగారు చక్ర కవచము
- బంగారు భుజ కీర్తులు 3
- బంగారు కర్ణపత్రములు 3
- బంగారు భావళీలు -3
- బంగారు సాలిగ్రామ హారములు- 3
- బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
- బంగారు కిటీపు ముఖపట్టి
- బంగారు కిరీటము
- 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
- 238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు.