- 4,89,233 మంది కొత్త లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను నగదు జమ
- అచ్చంపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం
- లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా వితంతువులు, ఒంటరి మహిళలే
- జమైన నగదును నవంబరు నెల పింఛనుగా పరిగణించిన ప్రభుత్వం
- డిసెంబరు నుంచి పాతవారితో పాటే రెగ్యులర్గా పంపిణీ
తెలంగాణలో కొత్తగా పింఛన్లు పొందిన లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎంపికైన 4,89,233 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛను నగదు నేరుగా జమైంది. అచ్చంపేటలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. కొందరు లబ్ధిదారులకు స్వయంగా ధ్రువపత్రాలు అందజేశారు. అనంతరం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేశారు.
ప్రభుత్వం ఈ మొత్తాన్ని నవంబరు నెల పింఛనుగా జమ చేసింది. వీరందరికీ డిసెంబరు నెల నుంచి పాత లబ్ధిదారులతో పాటే సాధారణ పద్ధతిలో నగదు అందుతుంది. కొత్తగా పింఛన్లు పొందిన వారిలో 70 శాతానికి పైగా వితంతువులు, ఒంటరి మహిళలే ఉండటం గమనార్హం. ఇందులో వితంతువులు 2,89,713 మంది, ఒంటరి మహిళలు 53,841 మంది ఉన్నారు. దివ్యాంగులు 1,00,273 మందికి లబ్ధి చేకూరింది. కల్లుగీత కార్మికులు 27,437 మంది, చేనేత కార్మికులు 4,450 మంది ఖాతాల్లో సొమ్ము పడింది. వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఫైలేరియా బాధితులు 6,375 మంది, ఎయిడ్స్ బాధితులు 2,938 మంది, డయాలసిస్ రోగులు 1,970 మందికి పింఛన్లు అందాయి. ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇతర విభాగాల వారు 2,236 మంది ఉన్నారు.
వీటితో పాటు పింఛనుదారులైన దంపతుల్లో ఒకరు చనిపోతే మరొకరికి తక్షణమే అందించే ఇన్‌స్టంట్ పింఛన్లు 1,23,625 మందికి వర్తింపజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా అందించిన పింఛన్ల సంఖ్య మొత్తం 6,12,858కు చేరినట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు.