- మైటీడీపీ యాప్‌లో 10 లక్షల మార్కు దాటిన సభ్యత్వాలు
- కార్యకర్తే పార్టీకి అసలైన బలం, బలగమన్న మంత్రి నారా లోకేశ్
- కష్టపడే కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టీకరణ
- డిజిటల్ పార్టీ నిర్వహణలో ప్రాంతీయ పార్టీల్లో సరికొత్త మైలురాయి
- నాయకత్వం, శ్రేణుల మధ్య వారధిగా మారిన మైటీడీపీ యాప్
కార్యకర్తే అధినేత అని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, బలగమని ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ (MyTDP) యాప్‌లో నమోదైన కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంపై టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేయగా, లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పార్టీ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలని, పార్టీ కోసం నిరంతరం శ్రమించే వారికి సముచిత అవకాశాలు దక్కాలనే లక్ష్యంతోనే ‘మైటీడీపీ’ యాప్‌కు శ్రీకారం చుట్టామని ఆయన వివరించారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైన 10 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
దేశంలోని ప్రాంతీయ పార్టీల డిజిటల్ నిర్వహణలో మైటీడీపీ యాప్ ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిందని టీడీపీ తన ప్రకటనలో వెల్లడించింది. నారా లోకేశ్ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ వేదిక ద్వారా సాధారణ కార్యకర్తలను గుర్తించి, వారి సేవలకు తగిన అవకాశాలు కల్పిస్తున్నట్లు పార్టీ తెలిపింది. గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, సేవా కార్యక్రమాలు చేపట్టే కార్యకర్తలు తమ వివరాలను ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేసుకునే సదుపాయం ఉంది.
యాప్‌లో నమోదయ్యే సమాచారం ఆధారంగా కార్యకర్తల పనితీరును నేరుగా పరిశీలించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీడీపీ స్పష్టం చేసింది. ఈ సాంకేతిక వేదిక ద్వారా పార్టీ అధినేత సందేశాలు, కీలక మార్గదర్శకాలు శ్రేణులకు వేగంగా చేరుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలను నేరుగా పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ యాప్ ఒక సమర్థవంతమైన సాధనంగా పనిచేస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి.