- హెచ్ఎండీఏ ఈ-వేలాన్ని వ్యతిరేకిస్తూ అమీర్‌పేట ప్రధాన కార్యాలయం ముట్టడి
- కూకట్‌పల్లి, మియాపూర్ పరిధిలో రూ.5 వేల కోట్ల విలువైన భూముల విక్రయంపై నిరసన
- నిరసనలో పాల్గొన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తదితరులు
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్, మూసాపేట హుడా ట్రక్ పార్క్ ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నెల 27న హెచ్ఎండీఏ నిర్వహించ తలపెట్టిన ఈ-వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నేతలు అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ నేతలు, స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని భూములను అమ్మడమేనా రేవంత్ రెడ్డి ప్రజాపాలన?" అంటూ ఈ సందర్భంగా మాధవరం నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం వల్ల రాష్ట్ర సంపద పెరగదన్నారు. ప్రజోపయోగ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రుల కోసం కేటాయించాల్సిన భూములను వాణిజ్య అవసరాలకు విక్రయించడం సరికాదని మండిపడ్డారు.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఆందోళన కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.