- 60.6 శాతం పెరిగిన గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో
- దేశవ్యాప్తంగా రూ.23.3 లక్షల కోట్లకు చేరిన రుణాలు
- యాక్టివ్ రుణాల సంఖ్య 10.2 కోట్లకు జంప్
- రిటైల్ రుణాల్లో గోల్డ్ లోన్ల వాటా 12.6 శాతం
- చిన్న పట్టణాలు, మహిళా రుణగ్రహీతల్లో రికార్డు వృద్ధి
భారతదేశంలో బంగారం రుణాల (గోల్డ్ లోన్) మార్కెట్ సరికొత్త గరిష్ఠాలను తాకుతూ దూసుకెళుతోంది. 2026 సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 60.6 శాతం పెరిగి రూ.23.3 లక్షల కోట్లకు చేరింది. ‘క్రిఫ్’ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తాజా నివేదిక ఈ ఆసక్తికర వివరాలను వెల్లడించింది.
దేశంలోని మొత్తం రూ.185.2 లక్షల కోట్ల రిటైల్ లోన్ మార్కెట్లో ఒక్క గోల్డ్ లోన్ల వాటాయే 12.6 శాతానికి చేరుకుంది. రుణాల సంఖ్యతో పోలిస్తే మొత్తం రుణ విలువలో భారీ పెరుగుదల నమోదైంది. దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఒక్కో అకౌంట్‌పై తీసుకునే సగటు రుణ మొత్తం (టికెట్ సైజ్) గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2024 సెప్టెంబర్‌లో రూ.10.7 లక్షల కోట్లుగా ఉన్న ఈ పోర్ట్‌ఫోలియో, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రెట్టింపు కంటే ఎక్కువగా రూ.23.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యాక్టివ్ రుణాల సంఖ్య 8.1 కోట్ల నుంచి 10.2 కోట్లకు ఎగబాకింది.
ప్రాధాన్యతా రంగానికి ఇచ్చిన బంగారు రుణాలు రూ.8.2 లక్షల కోట్లతో మొత్తం మార్కెట్లో 35.1 శాతం వాటాను దక్కించుకున్నాయి. రుణగ్రహీతల సంఖ్యను పరిశీలిస్తే, మహిళలు, చిన్న పట్టణాల ప్రజలే ముందువరుసలో ఉన్నారు. గోల్డ్ లోన్ తీసుకుంటున్న మహిళల సంఖ్య ఏటా 16 శాతం వృద్ధితో 2.4 కోట్లకు చేరింది. టైర్-3 సహా చిన్న నగరాల నుంచి రుణాలు తీసుకునేవారి సంఖ్య 16.1 శాతం వృద్ధితో 3.7 కోట్లకు విస్తరించింది. మరోవైపు హైరిస్క్ కేటగిరీ కిందకు వచ్చే రుణగ్రహీతల వాటా 14.8 శాతం నుంచి 16.7 శాతానికి పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.