- రేణిగుంట ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేతపై వెల్లంపల్లి విమర్శలు
- ఆలయాల కూల్చివేతను చంద్రబాబు ఎలా సమర్థిస్తారని ప్రశ్న
- వందల ఏళ్ల పురాతన ఆలయాన్ని కూల్చివేశారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్లకే కాకుండా ఇప్పుడు దేవాలయాలకూ బుల్డోజర్ల భయం పట్టుకుందని వైసీపీ నేత, మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడం అత్యంత దారుణమని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రోడ్డు అలైన్మెంట్ మార్చుకునే అవకాశం ఉన్నా ఆలయాన్ని ఎందుకు తొలగించారు? అని ప్రశ్నించారు. గతంలో దేవాలయాలపై చిన్న ఘటనలు జరిగినా ప్రభుత్వంపై విరుచుకుపడిన చంద్రబాబు.. ఇప్పుడు ఆలయాల కూల్చివేతను ఎలా సమర్థిస్తారని నిలదీశారు. 2024 నుంచి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వరుస అపచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాన్ని ప్రత్యామ్నాయాలు చూడకుండా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశారని ఆయన ఆరోపించారు.