- తల్లి సావిత్రీ దేవికి కన్నీటి వీడ్కోలు పలికిన సీఎం యోగి
- ఉత్తరాఖండ్‌లోని పంచూర్ గ్రామంలో తల్లి పాడె మోసిన సీఎం
- 91 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూసిన సావిత్రీ దేవి
- అమ్మను మించిన రక్షణ, ప్రేమ లేవంటూ యోగి భావోద్వేగ పోస్ట్
- హరిద్వార్‌లోని చండీ ఘాట్‌లో అంత్యక్రియలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లి సావిత్రీ దేవి అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలోని తమ పూర్వీకుల నివాసంలో శనివారం ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అమ్మ ప్రేమతో సమానమైనది ఈ సృష్టిలో ఏదీ లేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించిన సీఎం యోగి, స్వయంగా పాడే మోశారు.
ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. తల్లిని మించిన నీడ, ఆశ్రయం, రక్షణ, ప్రేమ మరేదీ లేదని పేర్కొన్నారు. 91 ఏళ్ల సావిత్రీ దేవి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో స్వగ్రామంలో కన్నుమూశారు. ఆ సమయంలో లక్నోలో అధికారిక కార్యక్రమంలో ఉన్న సీఎం యోగి, విషాదాన్ని దిగమింగుకుని షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి చేరుకుని కడసారి వీడ్కోలు పలికారు.
పంచూర్ గ్రామంలో ప్రాథమిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని హరిద్వార్‌లోని చండీ ఘాట్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు బీజేపీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. సావిత్రీ దేవి మృతిపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీఎం యోగి ఎప్పుడూ తన బాధ్యతలను కుటుంబం కోసం పక్కన పెట్టలేదని, అలాంటి సంస్కారాన్ని నేర్పిన గొప్ప తల్లి సావిత్రీ దేవి అని కొనియాడారు. అంత్యక్రియల క్రతువు ముగిసిన తర్వాత సీఎం యోగి తిరిగి లక్నో బయలుదేరనున్నారు.