- విదేశీ పౌరురాలైనప్పటికీ మారుతి సంస్థలో 50 శాతం వాటా ఉన్నట్లు వ్యాఖ్య
- 1970లో సోనియా సంస్థ డైరెక్టర్‌గా ఎలా అయ్యారని ప్రశ్న
- హర్యానాలో విదేశీ పౌరురాలికి భూమి ఎలా కేటాయించారంటూ ఎక్స్‌లో పోస్ట్
- ప్రధాని కార్యాలయంలో ప్రైవేట్ కంపెనీ ఆఫీస్ ఎలా తెరిచారని నిలదీత
- సొంత డబ్బు పెట్టకుండానే కంపెనీ ఎలా కట్టారో పుస్తకంలో రాయాలంటూ సెటైర్
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ లక్ష్యంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పౌరురాలై ఉండి కూడా ఆమెకు ఓ భారతీయ కంపెనీలో భారీగా వాటాలున్నాయని, ఆమె పేరిట భూమి కేటాయింపులు కూడా జరిగాయని పేర్కొన్నారు. శనివారం 'ఎక్స్' వేదికగా "కాంగ్రెస్ చీకటి అధ్యాయం - చాప్టర్ 250" పేరుతో ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. విదేశీ పౌరురాలైనప్పటికీ సోనియా గాంధీ 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారని, ఆ సంస్థలో ఆమెకు 50 శాతం వాటా ఉందని ఆరోపించారు.
1970 నవంబర్ 21న సోనియా గాంధీకి చెందిన 'మారుతి టెక్నికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్'తో సంజయ్ గాంధీ ఒప్పందం కుదుర్చుకున్నారని దూబే తెలిపారు. మారుతి సంస్థకు అసలైన యజమాని సోనియా గాంధీనే అని వ్యాఖ్యానించారు. మారుతి 1970లో ఏర్పాటవగా, కార్ల తయారీకి సంబంధించిన లేఖ 1968లోనే ప్రభుత్వానికి చేరిందన్నారు. 1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన కోడలు సోనియా నేతృత్వంలోని కంపెనీ కార్లు తయారు చేసేందుకు కేబినెట్ ఉత్తర్వులు ఇప్పించారా? అని నిలదీశారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక విదేశీయుడు భారతీయ సంస్థలో డైరెక్టర్ కాలేరని, మరి 1970లో సోనియా ఎలా డైరెక్టర్ అయ్యారని ప్రశ్నించారు.
అప్పట్లో హర్యానా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయులకు భూమి కేటాయించే అవకాశం లేనప్పుడు సోనియా పేరిట భూమి ఎలా కేటాయించారని దూబే ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ప్రైవేట్ కంపెనీ కార్యాలయం ఎలా తెరిచారని, ప్రధాని ప్రైవేట్ సెక్రటరీ ధావన్ దానికి డైరెక్టర్ ఎలా అయ్యారని నిలదీశారు. ఎలాంటి సొంత పెట్టుబడి పెట్టకుండానే ఇంత పెద్ద కంపెనీని ఎలా నిర్మించారో సోనియా గాంధీ తన తాజా పుస్తకంలో వివరిస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారాలపై 1979 నాటి జస్టిస్ ఏసీ గుప్తా కమిషన్ విచారణ నివేదికను ఉటంకిస్తూ, 1973 నుంచి 1975 మధ్య సంస్థలో సోనియా పాత్ర, ఆమె రాజీనామా వివరాలను కూడా నిషికాంత్ దూబే ప్రస్తావించారు.