తమిళంలో ఇటీవల విడుదలైన ఒక సర్వైవల్ థ్రిల్లర్, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా, కంటెంట్ పరంగా ఆడియన్స్ ను కట్టిపడేసిందనే టాక్ వచ్చింది. అశోక్ సెల్వన్ .. ప్రీతీ ముకుందన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కార్తికేయన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాన్స్ ను .. యాక్షన్ ను టచ్ చేస్తూ సాగే ఈ సినిమా, తెలుగులోను అందుబాటులో ఉంది.
సూర్య (అశోక్ సెల్వన్) ఇందు (ప్రీతీ ముకుందన్) ప్రేమించుకుంటారు. కలిసి జీవించాలనే ఒక నిర్ణయానికి రాగానే పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ ఒక స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉంటారు. అయితే అక్కడి పని ఒత్తిడిని .. అవమానాలను తట్టుకోలేక పోతారు. ఒక ప్రశాంతమైన ప్రదేశంలో 'హోమ్ స్టే'ను ఏర్పాటు చేసి, దానిని డెవలప్ చేస్తూ వెళ్లాలని భావిస్తారు. నగరానికి దూరంగా .. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఒక పాడుబడిన బంగ్లాను చూస్తారు. అది వారికి చాలా బాగా నచ్చుతుంది.
ఆ బంగళా వైపు వెళుతున్న సమయంలోనే, అక్కడి ఎమ్మెల్యే 'రాజ నాయగం' మనుషులతో సూర్యకి గొడవ అవుతుంది. ఎమ్మెల్యే మనుషులకు నాయకత్వం వహించే 'మార్టిన్'ను అక్కడే మొదటిసారిగా చూస్తాడు సూర్య. ఆ విషయాన్ని లైట్ తీసుకున్న సూర్య, ఆ బంగళాపై దృష్టి పెడతాడు. ఒకప్పుడు రాణి పద్మిని (రేవతి) నివసించిన బంగ్లా అది. ఇప్పుడు ఆమెకి అది ఒక అందమైన జ్ఞాపకం. అందువలన ఆమె ఆ బంగ్లాను ఎవరికీ అమ్మకుండా అలా ఉంచేస్తుంది. ఆమెను కలుసుకుని అతికష్టం మీద ఒప్పించి ఆ బంగళాను సూర్య కొనుగోలు చేస్తాడు.
సూర్య ఆ బంగ్లా కొనుగోలు చేసి, దానిని రీమోడల్ చేయించడం మొదలుపెడతాడు. అప్పటి నుంచి ఎమ్మెల్యే మనుషుల దాడి అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంటుంది. గతంలో జరిగిన గొడవ అందుకు కారణమని సూర్య భావిస్తాడు. పోలీస్ ఆఫీసర్ 'తవసి'ని కలిసి ఫిర్యాదు చేస్తాడు. అయితే అతను కూడా రాజానాయగానికి అనుకూలంగా స్పందిస్తాడు. అంతే కాదు .. 'ఇందు' గురించి వంకరగా మాట్లాడతాడు. ఈ కేసు గురించి ఇంటికి వచ్చి ఇందుతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ ఇంటిని సొంతం చేసుకోవడం కోసమే ఆ ఎమ్మెల్యే అలా చేస్తున్నాడనే విషయం అప్పుడు సూర్యకి అర్థమవుతుంది.
సూర్య దంపతులను బెదిరించి అతని ఇంట్లో ఏనుగు దంతాలు .. మాదక ద్రవ్యాలు .. పేలుడు పదార్థాలు పెట్టిస్తాడు రాజనాయగం. ఆ కేసులో సూర్యను జైలుకు పంపించాలనేది అతని ఆలోచన. ఈ విషయంలో అతనికి వకీలు మార్టిన్ .. పోలీస్ ఆఫీసర్ తవసి సపోర్టు ఫుల్ గా ఉంటుంది. ఇదే సమయంలో తనకి వ్యతిరేకంగా పోలీస్ పైఅధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన నాగరాజును రాజనాయగం హత్య చేస్తాడు. ఆ హత్యను సూర్య వీడియో తీస్తాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? రాజనాయగం అనుచరులు ఏం చేస్తారు? సూర్య దంపతులు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతారా? అనేది మిగతా కథ.
అది అడవికి దగ్గరగా ఉన్న ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో రౌడీయిజమైనా రాజకీయమైనా రాజనాయగం చేయవలసిందే. అక్కడి రాణి పద్మినీ బంగళాపై అతను కన్నేస్తాడు. కానీ అలాంటి వారికి ఆ బంగళాను అమ్మడం ఆమెకి ఇష్టం ఉండదు. అందువలన ఆమె నుంచి ఆ బంగళాను తీసుకున్న సూర్య దంపతులపైకి తన అనుచరులను పురిగొల్పుతాడు. ఆ బంగళా ఖాళీ చేసి వాళ్లు పారిపోయేలా చేయాలనుకుంటాడు. అందుకోసం అతను చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఈ కథ లవ్ .. రొమాన్స్ తో మొదలవుతుంది. ఎమ్మెల్యే మనుషులతో సూర్య గొడవ పడటంతో కథ మొదటి మలుపు తీసుకుంటుంది. వకీల్ మార్టీన్ .. పోలీస్ ఆఫీసర్ తవసి, ఎమ్మెల్యే మనుషులేనని సూర్యకి అర్థం కావడంతో రెండో మలుపు తిరుగుతుంది. తన భార్య కోసం తాను కొన్న బంగళాను ఎమ్మెల్యేకి భయపడి వదులుకోకూడదని హీరో నిర్ణయించుకోవడంతో కథ మరింత పుంజుకుంటుంది. ఇక ఎమ్మెల్యే ఒక మర్డర్ చేయడాన్ని సూర్య సెల్ ఫోన్ తో రికార్డు చేయడంతో కథ మరింత చిక్కబడుతుంది.
సూర్యను వకీలు టార్గెట్ చేయడం .. ఇందుపై వ్యామోహంతో ఆమెను పోలీస్ ఆఫీసర్ టార్చర్ చేయడం .. దంపతులిద్దరికీ మనఃశాంతి లేకుండా ఎమ్మెల్యే వేసే ఎత్తులతో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు ఆసక్తికరంగా డిజైన్ చేశారు. తన భార్యను రక్షించుకోవడం కోసం .. తన ఇంటిని కాపాడుకోవడం కోసం ఒక సాధారణ యువకుడు చేసే పోరాటం గొప్పగా అనిపిస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సన్నివేశాలు ప్రేక్షకులు కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి.
రాజకీయ నాయకుడు .. వకీలు .. పోలీస్ ఆఫీసర్ .. వాళ్ల అనుచరులు, సూర్య దంపతుల ఇంటిని చుట్టముట్టడంతో ఈ కథ క్లైమాక్స్ దిశగా పరుగులు పెడుతుంది. చివరి 40 నిమిషాలకు సంబంధించిన కథ ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తుంది. చాలా ప్రాంతాలలో ఇలాంటి సంఘటనలు చూసి ఉండటం వలన .. విని ఉండటం వలన ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తుంది.
భార్యాభర్తలు .. రాజకీయనాయకుడు .. వకీల్ .. పోలీస్ ఆఫీసర్, ఈ ఐదుగురు చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను టెన్షన్ పెడుతుంది. పాత్రధారులంతా చాలా సహజంగా నటించారు. కార్తికేయన్ టేకింగ్ .. గౌతమ్ రాజేంద్రన్ ఫొటోగ్రఫీ .. గోవింద్ వసంత నేపథ్య సంగీతం .. సెల్వ ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి, ఈ సినిమా నచ్చుతుందని చెప్పచ్చు.

Movie Details
Movie Name: Anbil Avan
Genre: Action, Thriller
Release Date: 20 Nov 2026
Cast: Ashok Selvan, Preity Mukhundhan, Revathi, Sabumon Abdusamad, Kathiravan Balu, Maha Delhi Ganesh
Director: Karthikeyan
Music: Govind Vasantha
Banner: Ayngaran International
Review By: Peddinti