- నోయిడాకు చెందిన అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న దృశ్యాలు
- చిరునవ్వుతోనే కన్నీళ్లు దాచుకున్న తండ్రి ముఖ కవళికలు
- తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమను కొనియాడుతున్న నెటిజన్లు
- సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న భావోద్వేగ వీడియో
పిల్లలు దూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు వీడ్కోలు చెప్పే క్షణాలు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నవి. పైకి నవ్వుతూ సాగనంపుతున్నా.. లోపల వారి మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. తాజాగా ఓ యువతి తన రైలు ప్రయాణానికి ముందు తల్లిదండ్రులు వీడ్కోలు పలికిన తీరును కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకోగా, ఆ దృశ్యాలు నెటిజన్ల మనసులను తీవ్రంగా కదిలిస్తున్నాయి.
నోయిడాకు చెందిన అనుష్క అనే యువతి ఇటీవల రైలులో ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెను సాగనంపేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆమె రైలు ఎక్కిన తర్వాత కిటికీలో నుంచి తన తల్లిదండ్రులను వీడియో తీశారు. రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభించగానే.. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న తల్లిదండ్రులు కూడా రైలు వేగానికి తగినట్లుగా కొంత దూరం పక్కనే నడిచారు. కదులుతున్న రైలు వెంట నడుస్తూనే కూతురికి చేతులు ఊపుతూ వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ఆమె తండ్రి చిరునవ్వుతో ‘థమ్స్ అప్’ చూపిస్తూ, రైలు పూర్తిగా ముందుకు వెళ్లిపోయే వరకు చేతులు ఊపుతూనే కనిపించారు.
ఈ భావోద్వేగ దృశ్యాలను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "ఐ లవ్ దెమ్ సో మచ్" అని రాసుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఆ తండ్రి ముఖంలో కనిపించిన భావాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. పైకి నవ్వుతూ కనిపిస్తున్నప్పటికీ, కూతురిని విడిచి ఉండాల్సి వస్తుందన్న బాధతో ఆయన కన్నీళ్లు ఆపుకుంటున్న తీరు స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారో, ఎంత తపిస్తారో ఈ వీడియో మరోసారి గుర్తుచేసిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ దృశ్యాలు తమ సొంత అనుభవాలను గుర్తుకు తెచ్చాయని, కన్నీళ్లు ఆగలేదని నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ దంపతులు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నెటిజన్లు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.