- 4,000 మంది అగ్నివీరుల డేటాను చోరీ చేసినట్లు గుర్తింపు
- డార్క్ వెబ్‌లో 500 డాలర్లకు డేటా అమ్మకానికి యత్నం
- హర్యానా బల్లాభ్గఢ్లో బాలుడిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
- ఏఐ టూల్స్ సాయంతోనే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన మైనర్
- డిజిటల్ పరికరాల నుంచి డేటాను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- డేటా నిర్ధారణ కోసం హోం మంత్రిత్వ శాఖ రికార్డుల పరిశీలన
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో నాలుగేళ్ల సర్వీస్ కోసం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. మాజీ అగ్నివీరులు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఒక టెస్ట్ వెబ్‌సైట్‌ను హర్యానాకు చెందిన 14 ఏళ్ల బాలుడు హ్యాక్ చేశాడు.
ఈ హ్యాకింగ్ ద్వారా సుమారు 4,000 మంది అగ్నివీరుల వ్యక్తిగత వివరాలను సేకరించి, వాటిని డార్క్ వెబ్‌లో విక్రయించేందుకు యత్నించాడు. ఈ సమాచారాన్ని 500 డాలర్లకు (దాదాపు రూ.40 వేలకు పైగా) అమ్ముతానంటూ డార్క్ వెబ్‌లో బాలుడు ఒక ప్రకటన కూడా పోస్ట్ చేశాడు.
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఓ) విభాగం వేగంగా స్పందించింది. హర్యానాలోని బల్లాభ్‌గఢ్‌కు చెందిన ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించి ఆ బాలుడు ఈ టెస్ట్ సైట్‌లోకి చొరబడినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న డిజిటల్ పరికరాల నుంచి చోరీకి గురైన మొత్తం డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చోరీకి గురైన సమాచారం అసలైనదేనా? కాదా? అని నిర్ధారించుకునేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) అధికారిక రికార్డులను పోలీసులు కోరారు. చట్టప్రకారం మైనర్ బాలుడిని ప్రాథమికంగా ప్రశ్నించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ డేటా ఉల్లంఘన తీవ్రత ఎంతవరకు ఉంది? ఇతర వివరాలు ఏవైనా లీక్ అయ్యాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.