- ఏపీ స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయని రామకృష్ణ
- ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణ
- పాలకపక్ష నేతల కంటే పోలీసుల బెదిరింపులే అధికంగా ఉన్నాయని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు తీవ్రస్థాయికి చేరాయని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విపక్షాలు కనీసం పోటీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన ఎన్నికల్లో దౌర్జన్యం పెరిగిపోయిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే జరుగుతుండటంతో ఆయన రాజకీయ జీవితానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"అధికార పార్టీ నేతల కంటే పోలీసుల ఎక్కువ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు మచ్చగా తయారయ్యాయి. దీనికి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏపీలో ఓటు హక్కు కోసం ఎన్నికల నిర్వహణపై ప్రజలు ఉద్యమాలు చేయాలి. డబ్బులు చెల్లిస్తే ఓటు వేసే సంస్కృతిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్నికల్లో డబ్బు, దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంగా మార్చారు" అని ఆరోపించారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ కోసం ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చోటుచేసుకున్న దాడులు, దౌర్జన్యాలపై సీపీఐ ఆధ్వర్యంలో మేధావులతో ప్రత్యేక చర్చా వేదికలు, సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తామని వెల్లడించారు.