- న్యూజిలాండ్‌లోని ది వేర్‌హౌస్ గ్రూప్ పంపిణీ కేంద్రాల్లో ఉద్యోగుల నిరసన
- టాయిలెట్ బ్రేక్‌లను పర్యవేక్షిస్తూ ఉద్యోగులను మందలిస్తున్నారని ఆరోపణ
- ఏఐ ద్వారా టాయిలెట్ వెళ్లే సమయాన్నీ లెక్కిస్తున్నారని ఆందోలన
- దీంతో గోదాముల్లోనే మలవిసర్జన ఘటనలు జరిగినట్లు వెల్లడి
- టాయిలెట్ వినియోగంపై నిఘా లేదంటున్న ది వేర్‌హౌస్ గ్రూప్
టెక్నాలజీ మనుషుల పనిని సులభతరం చేయాలి. పని వేగాన్ని పెంచాలి. కానీ అదే టెక్నాలజీ ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలపైనా నిఘా పెట్టి, కనీస స్వేచ్ఛను హరిస్తే? న్యూజిలాండ్‌లో ఓ సంస్థ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇప్పుడు ఈ ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. టాయిలెట్‌కు వెళ్లే సమయాన్ని కూడా ఏఐ పర్యవేక్షిస్తోందని, దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
టాయిలెట్ బ్రేక్‌పైనా నిఘా
న్యూజిలాండ్‌లో అతిపెద్ద రిటైల్ సంస్థ అయిన 'ది వేర్‌హౌస్ గ్రూప్'కు చెందిన ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చ్ పంపిణీ కేంద్రాల్లో 300 మందికి పైగా ఉద్యోగులు ఈ వారం నిరసనలు చేపట్టారు. తమ ఉద్యోగాలను టెక్నాలజీ భర్తీ చేయడమే కాకుండా, వ్యక్తిగత అవసరాలపైనా నిఘా పెడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. టాయిలెట్‌కు వెళ్లిన సమయాన్ని లెక్కపెడుతూ, ఎక్కువ సమయం తీసుకున్నవారిని ఉన్నతాధికారులు మందలిస్తున్నారని యూనియన్ నిర్వాహకురాలు హేలీ కోర్ట్నీ ఆరోపించారు. ఈ సమస్యపై ఎనిమిది నెలలుగా పోరాడుతున్నట్లు తెలిపారు.
గోదాముల్లోనే మలవిసర్జన చేయాల్సిన పరిస్థితి
టాయిలెట్‌కు వెళ్లే హక్కు కోసం సూపర్‌వైజర్లు, మేనేజర్లు ఉద్యోగుల వెంట వెళ్లి ప్రశ్నించడం దారుణమని కోర్ట్నీ వ్యాఖ్యానించారు. సమయానికి టాయిలెట్‌కు వెళ్లలేక కొందరు ఉద్యోగులు ఆపుకొనే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో గోదాముల్లోనే మలవిసర్జన చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. నేలపై మలవిసర్జన కనిపించిన సందర్భాలు పలుసార్లు ఉన్నాయని, ఈ విషయంపై తాను గట్టిగా నిలదీసిన తర్వాత అవి ఆగిపోయాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఉద్యోగులకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.
రోబోలు, డ్రోన్లతో ఉద్యోగుల ఆందోళన
మరోవైపు సంస్థ గోదాముల్లో వస్తువులను ఎంపిక చేసేందుకు భారీ రోబోను ప్రవేశపెట్టిందని కోర్ట్నీ తెలిపారు. భౌతికంగా స్టాక్ తనిఖీలు చేసే బృందంలోని కొందరి స్థానంలో ఏఐ ఆధారిత డ్రోన్లను తీసుకొచ్చారని చెప్పారు. సామర్థ్యాన్ని పెంచే టెక్నాలజీకి తాము వ్యతిరేకం కాదని, అయితే భవిష్యత్తులో తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటో సంస్థ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఆరోపణలను ఖండించిన సంస్థ
కార్మిక సంఘాల ఆరోపణలను ది వేర్‌హౌస్ గ్రూప్ ఖండించింది. ఈ ఆరోపణలు తమను దిగ్భ్రాంతికి గురిచేశాయని సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రిచర్డ్ పార్కర్ తెలిపారు. సామర్థ్యాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తున్నది ఏఐ కాదని, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ కేంద్రాల్లో దశాబ్దాలుగా వాడుతున్న స్కానింగ్ టెక్నాలజీ మాత్రమేనని స్పష్టం చేశారు. దానికి టాయిలెట్ వినియోగంతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
డ్రోన్ల వినియోగం వల్ల స్టాక్ లెక్కల్లో కచ్చితత్వం పెరుగుతుందని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చని చెప్పారు. రాత్రివేళ యంత్రాలపై ఎత్తులో పనిచేయాల్సిన అవసరాన్ని తగ్గించడం ద్వారా ఉద్యోగుల భద్రతకు కూడా మేలు జరుగుతుందని వివరించారు.
ఉద్యోగాల భవిష్యత్తుపై హామీ ఏంటి?
భవిష్యత్తులో ఉద్యోగుల బాధ్యతలు ఎలా మారతాయో ఏ సంస్థా ముందుగానే హామీ ఇవ్వలేదని యాజమాన్యం పేర్కొంది. అయితే ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతామని, అవసరమైతే వారికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఇతర విభాగాల్లో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది.